Tier 2 Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎప్పటికప్పుడు పోటీ నడుస్తూనే ఉంటుంది. టైర్ వన్ హీరోల్లో ఎవరు నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగిపోతున్నారు అనే విషయంలో ఎప్పటికప్పుడు తీవ్రతరమైన పోటీ నడుస్తుంది. ఇక ఇలానే టైర్ 2 హీరోల విషయంలో కూడా అలాగే పోటీ ఉంది. కొంత మంది సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతుంటే మరి కొంతమంది మాత్రం ఫ్లాప్ లను మూటగట్టుకొని వెనుకబడిపోతున్నారు. నాని లాంటి హీరో టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ఇక తన తర్వాత విజయ్ దేవరకొండ ఉండడం విశేషం…రామ్, నాగ చైతన్య, నితిన్ లాంటి వారు ఆ తర్వాత పొజిషన్లో కొనసాగుతున్నారు. నిజానికి నితిన్ వరుసగా ఆరు ప్లాపులతో మరోసారి డీలా పడిపోయాడు. తను మరోసారి తన సత్తా చాటాలంటే మాత్రం సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
తన తోటి హీరోలందరు స్టార్ హీరోలుగా ఎదుగుతుంటే ఆయన మాత్రం ఇంకా టైర్ 2 హీరో గానే మిగిలిపోయాడు. ఇప్పటికి తను ఒక్క సక్సెస్ కూడా సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టినప్పటికి మధ్యలో వచ్చిన ఫ్లాపులతో ఆయన మరింత డీలా పడిపోయాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట తన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇక నాని సైతం ప్యారడైజ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే ఆయన టైర్ వన్ హీరోల లిస్టులోకి చేరిపోయే అవకాశం ఉంది.
ఇక ప్యారడైజ్ సినిమా తేడా కొడితే మాత్రం టైర్ 2 హీరోల లిస్టులో కూడా ఆయన చాలా వరకు వెనుకబడిపోయే ప్రమాదమైతే ఉంది. రణబాలి, రౌడీ జనార్ధన్ సినిమాలతో విజయ్ దేవరకొండ సైతం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…నాగ చైతన్య సైతం వృష కర్మ సినిమాతో సక్సెస్ ను సాధించాలి…
