Tickets Price in AP: సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి ? జగన్ ఏమైనా నిర్మాతా ? లేక, జగన్ ప్రభుత్వంలో ఏమైనా సినిమా నిపుణులు ఉన్నారా ? ఒక్క ఏపీలో మాత్రమే సినిమా టికెట్ల విక్రయం పై వివాదం నడుస్తోంది ? రోజురోజుకు ఈ వివాదం ముదురుతూనే ఉంది. అసలు ఈ ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం వల్ల ఎవరికీ లాభం ? సరే.. ప్రస్తుతానికి ప్రేక్షకులకు లాభం అందుకుందాం. అంటే.. సినిమా టికెట్ రేట్లు తగ్గించాం.. ఇక అందరూ అడ్డమైన ప్రతి సినిమా చూసి సంతోషంగా టైమ్ పాస్ చేయండి అని చెప్పడం జగన్ ఉద్దేశ్యమా ?

జగన్ ఈ సినిమా టికెట్ల పై పెట్టిన శ్రద్ధ.. రాష్ట్రంలోని నిరుద్యోగుల పై పెట్టి ఉంటే.. వాళ్లకు నైపుణ్యం పెంచుకునే అవకాశాలు కల్పించి ఉంటే.. ఎంత బాగుండేది ? అయినా ప్రజలకు కావాల్సింది సినిమా టికెట్ రేట్లు తగ్గింపు కాదు. నిత్యావసర వస్తువుల తగ్గింపు. భారీగా పెరిగిపోయిన పెట్రోల్ ధరల తగ్గింపు. వాటిల్లో లేని తగ్గింపు ఒక్క సినిమా టికెట్లకు మాత్రమే ఎందుకు ?
జగన్ ఎందుకు టికెట్ల రేట్లు విషయంలో అంతగా పట్టుదలగా ఉన్నాడు ? పవన్ కళ్యాణ్ పై కోపమా ? లేక, తనకు సరైన మద్దతు ప్రకటించలేదు గనుక మొత్తం సినిమా ఇండస్ట్రీ పైనే కోపమా ? ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లు వచ్చేస్తే తమ జీవితాలు నాశనం అవుతాయని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఆందోళనలో మగ్గిపోతున్నారు. సరే, అది వాళ్ళ కర్మ అనుకోవచ్చు.
కానీ రేట్ల విషయంలో ఎవరి కర్మ అనుకోవాలి ? విద్య వైద్యంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయిన రేట్లును జగన్ ఎందుకు పట్టించుకోడు ? అంటే, జగన్ ఏం చేసినా దానికి తిరుగులేదు అనుకోవాలా ? అసలు జగన్ కారణంగా వ్యవస్థలన్నీ కుళ్లిపోతున్నాయని విమర్శలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. అయినా ఎవర్నో దెబ్బ కొట్టడానికి మొత్తం సినిమా పరిశ్రమనే దెబ్బ కొట్టాలనుకోవడం బాధాకరమైన విషయం.
Also Read: Pooja Hegde: మద్యం కలుపుతూ బుట్టబొమ్మ వీడియో వైరల్.. ఇంత చీప్ టేస్ట్ అనుకోలేదంటూ ట్రోల్స్!
తమకు అండగా లేని వాళ్ళకు ఎలాంటి అండ లేకుండా అధికార దుర్వినియోగం చేయడం నాయకుడి లక్షణం అనిపించుకోదు. టిక్కెట్ రేట్లు పెంచాలని సినీ పెద్దలు రిక్వెస్ట్ చేస్తున్నారు. జగన్ కి నాగార్జున, చిరంజీవి సన్నిహితులు. కాబట్టి.. తమకు ఇష్టమైన హీరోల సినిమాలను సెలక్టివ్ గా ఎంచుకుని ఆ సినిమాలకు మాత్రం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించడానికి జగన్ బాబు అంగీకరించారట. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి ? పగకు బలి కావాల్సిందే.