RGV: ఆయన స్టైల్ పద్దతి పేరు.. ఎప్పుడూ ఓ చేతిలో ఓడ్కా.. మరో చేతిలో సినిమా.. ఆయనకు ఈ ప్రపంచం తప్ప ఇంకేం అక్కర్లేదు. మంచైనా, చెడైనా ఏదీ మనసులో దాచుకోడు.. మొహం మీద కొట్టినట్లు చెప్పేస్తాడు. అప్పుడ్ప్పుడూ స్టార్ హీరోలను, రాజకీయనాయకులను అంతెందుకూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కూడా వదల్లేదు. ఎప్పుడూ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంటాడు..వివాదాల్లో టాప్‌లో ఉంటాడు. ఆయనే రామ్‌గోపాల్ వర్మ. ఆయనకు సన్నిహితులు రాము అని పిలుస్తుంటారు. అయితే, ఇప్పటి వరకు ఎప్పుడూ ఏపీ సీఎం జగన్‌ను విమర్శిస్తూ.. ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.. కానీ, తాజాగా, ఓ ఇంటర్వ్యూలో జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆర్చీవీ.

Also Read:తన కెరీర్లోనే తొలిసారి ఓ నవలను సినిమాగా తీసుకొస్తున్న ఆర్జీవీ.. అందులో ఏముంది?
అసలు మీరు ఎందుకు జగన్‌పై కామెడీ చేయరు అని అడగ్గా.. నేను అభిమానించే నాయకుల్లో జగన్ ఒకరని.. ఆయన్ను చాలా దగ్గరగా చూశానని అన్నారు. జైల్లో ఉన్నప్పుడు జగన్‌ను బాగా పరిశీలించినట్లు.. తెలిపారు. ఆ సమయంలో కానీ, తంద్రి మరణించినప్పుడు కానీ, ఒంటరిగా పోరాటం చేసినప్పుడూ ఇలా ఎప్పుడూ కుంగిపోలేదని.. ధైర్యంగా నిలబడ్డారని అన్నారు. అందుకే జగన్ అంటే చాలా ఇష్టమని అన్నారు.
ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ అసలు బెదరలేదని.. ఒక్కడే ఎవరి తోడు లేకుండా నిలబడి.. ఇప్పుడు సీఎం అయ్యాడని అన్నారు. కాగా, ప్రస్తుతం వర్మ కొండా అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలంగాణా రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు, లడికీ, డేంజరస్ తదితర సినిమాలూ లైన్లో ఉన్నాయి.
Also Read: ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త మార్కెట్‌ను పరిచయం చేస్తోన్న ఆర్జీవీ!