Thug Life Movie : కమల్ హాసన్(Kamal Haasan), మణిరత్న(Maniratnam) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘థగ్ లైఫ్'(Thug Life) చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రంలో తప్ప. రీసెంట్ గా జరిగిన ఈ సినిమా కర్ణాటక ప్రొమోషన్స్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ ‘కన్నడ భాష తమిళం నుండే పుట్టింది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదంగా మారింది. కమల్ హాసన్ ని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కానీ ఆయన నా తప్పు లేకుండా క్షమాపణలు చెప్పడం కుదరదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం కమల్ హాసన్ ఇప్పటికైనా దిగొచ్చి క్షమాపణలు చెప్తాడేమో అని అనుకుకున్నారు.
Also Read : రాజాసాబ్ టీజర్ లో చూపించేది ఇదేనా..?
కానీ ఆయన క్షమాపణలు చెప్పలేదు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ వివరణ ఇస్తూ ఒక లేఖని విడుదల చేసాడు. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రం పై నిషేధం విధించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన కర్ణాటక థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 12 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు కమల్ నోటి దూల కారణంగా ఈ సినిమాని కొనుగోలు చేసిన కర్ణాటక బయ్యర్స్ నష్టాలు చూసేలా ఉన్నారు. ఇప్పటికీ మునిగిపోయింది ఏమి లేదని, దయచేసి క్షమాపణలు చెప్పమని కర్ణాటక బయ్యర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కమల్ హాసన్ తగ్గడం లేదు. ఇంత పంతం అసలు పనికిరాదని బయ్యర్స్ ఆయనపై మండిపడుతున్నట్టు తెలుస్తుంది. కర్ణాటక రాష్ట్ర ప్రజలు తమ భాషని ఎంత పవిత్రంగా భావిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కర్ణాటక లో నివసించే తెలుగు వాళ్ళు అయినా సరే, ఆ భాషని నేర్చుకొని మాట్లాడాల్సిందే. లేకపోతే కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
అలాంటి చోటకు వెళ్లి కమల్ హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే గెలికి కొట్టించుకోవడమే అని ఆయన అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ క్షమాపణలు చెప్తే తమిళనాడు ప్రేక్షకులు ఊరుకోరు. ఆయన రాజకీయ జీవితం పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఆయన కర్ణాటక లో నష్టం వచ్చినా పర్వాలేదు అనే ధోరణితో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా కమల్ హాసన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన కర్ణాటక బయ్యర్స్ కి తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాడా? లేదా అనేది పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ చిత్రం లో కమల్ హాసన్ తో పాటు శింబు కూడా నటించిన సంగతి తెలిసిందే. త్రిష ఇందులో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.