Bhairava Collections : రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మీడియం బడ్జెట్ చిత్రం ‘భైరవం'(Bhairavam Movie). చాలా కాలం తర్వాత మంచు మనోజ్(Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) మరియు నారా రోహిత్(Nara Rohit) ముగ్గురు కలిసి మన తెలుగు ఆడియన్స్ కి ఈ చిత్రం ద్వారా వెండితెర పై కనిపించారు. సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ముగ్గురు హీరోలు కలిసి నటిస్తుండడం వల్ల ఈ రేంజ్ బిజినెస్ జరిగింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా మామూలు రేంజ్ లోనే వచ్చాయి. వీకెండ్ వసూళ్లు కూడా ఏ మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు అవసరం అయ్యేలా కనిపించడం లేదు.
Also Read : థగ్ లైఫ్’ చిత్రం విడుదలని నిషేదించిన ప్రభుత్వం..కమల్ నోటి దూల ఎంతపని చేసింది!
సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల 6 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు కోటి 65 లక్షల రూపాయిలు రాగా, రెండవ రోజు కోటి 46 లక్షలు, కోటి 33 లక్షలు, నాల్గవ రోజున 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 70 లక్షల రూపాయిల షేర్, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ తర్వాత మొదటి వర్కింగ్ డే లో భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇది ఏ మాత్రం మంచి ట్రెండ్ కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వస్తాయట.
అంటే బయ్యర్స్ కి కనీసం 7 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ముగ్గురు హీరోలు కలిసి నటించిన ఒక సినిమా పాజిటివ్ టాక్ తో కూడా ఫ్లాప్ వైపు అడుగులు వేయడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో రెండు కోట్ల 7 లక్షలు, సీడెడ్ ప్రాంతం లో 73 లక్షలు, ఆంధ్ర ప్రాంతం లో 2 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్లు చెప్తున్నారు. ఒక్కటంటే ఒక్క ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. మహేష్ బాబు ‘ఖలేజా’ మూవీ రీ రిలీజ్ అవ్వడం ఈ చిత్రంపై తీవ్రమైన ప్రభావం చూపించిందని అంటున్నారు విశ్లేషకులు.