‘Thug Life’ First Day Collections : కమల్ హాసన్(Kamal Haasan), శింబు(Silambarasan TR) ప్రధాన పాత్రలు పోషిస్తూ మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కిన ‘థగ్ లైఫ్'(Thug Life) నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కారణంగా ఓపెనింగ్స్ దారుణంగా ఎఫెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా కమల్ హాసన్ సినిమా అంటే కచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాకు కనీస స్థాయిలో కూడా ఆక్యుపెన్సీలు నమోదు అవ్వలేదు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 2 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ ని ప్రముఖ యంగ్ హీరో నితిన్ కొనుగోలు చేసాడు.
ఈ చిత్రం ద్వారా ఆయనకు కనీసం ప్రింట్ ఖర్చులు కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఇక మిగిలిన ప్రాంతాల వసూళ్ల విషయానికి వస్తే తమిళనాడు లో ఈ చిత్రానికి కేవలం 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది కమల్ హాసన్ రేంజ్ కి చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఆయన గత చిత్రం ‘ఇండియన్ 2’ ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ తమిళనాడు ప్రాంతం నుండి 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంతకు ముందు వచ్చిన ‘విక్రమ్’ సినిమాకు దాదాపుగా 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువ అనొచ్చు. పైగా ఈ చిత్రంలో శింబు లాంటి క్రేజ్ ఉన్న హీరో ఉన్నాడు. కాంబినేషన్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్ పెట్టేంత సత్తా ఉన్న హీరో శింబు. అలాంటి శింబు కమల్ హాసన్ తో కలిసి నటిస్తే వచ్చే ఓపెనింగ్ ఇదా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : థగ్ లైఫ్ ‘ ఫుల్ మూవీ రివ్యూ…
అదే విధంగా కేరళలో కోటి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెస్ట్ ఆఫ్ ఇండియా లో రెండు కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఓవర్సీస్ లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. నార్త్ అమెరికా లో కూడా దాదాపుగా 8 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సూపర్ హిట్ టాక్ వచ్చి ఉండుంటే కచ్చితంగా ఈ ఏడాది భారీ ఓపెనింగ్ ని రాబట్టి ఉండేది. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన తమిళ సినిమాల్లో అజిత్ కుమార్ నటంచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘విధముయార్చి’ చిత్రాలే టాప్ 2 స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత సూర్య హీరో గా నటించిన ‘రెట్రో’ చిత్రం మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఈ మూడు చిత్రాల తర్వాత ఓపెనింగ్స్ లో నాల్గవ స్థానాన్ని సొంతం చేసుకుంది ‘థగ్ లైఫ్’ చిత్రం.