Thudarum OTT Review : మలయాళ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి కథలతో సినిమాలు వచ్చి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పటికే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన మలయాల ఇండస్ట్రీ ఇప్పుడు మోహన్ లాల్ హీరోగా ‘తుడరుమ్’ అనే మరొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ‘జియో హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ కి అయితే వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే షణ్ముగం అలియాస్ బెంజ్ (మోహన్ లాల్) ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తాడు. ఆయన భార్య (శోభన) ఇద్దరు పిల్లలతో ఆయన చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీళ్ళ లైఫ్ ప్రశాంతంగా సాగుతున్న క్రమంలో ఒకరోజు షణ్ముగం అలియాస్ బెంజ్ కారులో గంజాయి సప్లై చేస్తున్నాడు అనే కేసులో అతని కారును సీజ్ చేస్తాడు ఎస్సై బెన్నీ(బిను పప్పు)…ఇక బెంజ్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికి తన కారు తనకి ఇవ్వడానికి బెన్నీ ఒప్పుకోడు…
ఇక సిఐ జార్జ్ (ప్రకాష్ వర్మ) మాత్రం బెంజ్ కి కార్ కీస్ ఇస్తాడు కానీ తను చెప్పినట్టుగా చేయాలని చెప్తాడు. తమని ఒక అడవిలో జరిగే జాతరకు తీసుకెళ్లాలని చెబుతాడు. దానికి బెంజ్ కూడా ఒప్పుకొని అక్కడికి తీసుకెళ్తాడు. ఇక అక్కడి నుంచి ఎలాగోలా బెంజ్ బయటపడి ఇంటికి వచ్చేసరికి తన కొడుకు మిస్ అవుతాడు…అసలు ఈ పోలీసులకు బెంజ్ కి సంబంధం ఏంటి..? కావాలనే ఆయన్ని అరెస్ట్ చేసి తన కార్ ను సీజ్ చేశారా..? అతని కొడుకు మిస్ అవ్వడానికి కారణం ఎవరు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు తరుణ్ మూర్తి తను అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాల్లో ఒక ఇంటెన్స్ డ్రామాను మిక్స్ చేసి ముందుకు తీసుకెళ్లిన విధానమైతే బాగుంది.ప్రతి సీన్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉండడం ఈ సినిమాకు చాలా వరకు కలిసి వచ్చింది. మోహన్ లాల్ లాంటి ఒక స్టార్ హీరో ఇమేజ్ ను బేస్ చేసుకొని సినిమాలు తీయకుండా కేవలం కంటెంట్ బేస్డ్ గా సినిమాను తీసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ మూవీలో ఎక్కడ కూడా మనకు మోహన్ లాల్ కనిపించకుండా బెంజ్ పాత్రను మాత్రమే కనిపించేలా చేశారంటే అందులో దర్శకుడు చాలా వరకు మోహన్ లాల్ తో తనకు కావలసిన యాక్టింగ్ ను చేయించుకొని మరి ఆ సినిమాని విజయతీరాలకు చేర్చాడనే చెప్పాలి.
ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కోర్ ఎమోషన్ సీన్స్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మోహన్ లాల్ ఒక్కో చిక్కుముడి విప్పుతూ ముందుకు వెళుతూ పోలీసులు ఎందుకని అలా చేశారు అనే విషయాన్ని తెలుసుకునే సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సీన్స్ వల్లే సినిమా మీద హైప్ అయితే వచ్చింది… మూవీ చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక క్యూరియాసిటీ అయితే రేకెత్తిస్తూ ఉంటారు ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే మోహన్లాల్ బెంజ్ పాత్రలో అద్భుతంగా నటించాడు కొన్ని సందర్భాల్లో ఆయన తప్ప సినిమాకి మరెవరు సెట్ అవ్వరు అనేంత రేంజ్ లో నటించే వ్యక్తిని కాకుండా ప్రేక్షకులందరిని ప్రయత్నం కూడా చేశాడు… ఎస్సై గా చేసిన బిను పప్పు తన నటనతో ఆకట్టుకున్నాడు ముఖ్యంగా మోహన్లాల్ ఇబ్బంది పెట్టే సన్నివేశాల్లో ఆయనను చూస్తే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది అలాగే సీఐగా చేసిన ప్రకాష్ వర్మ నటన కూడా చాలా బాగుంది నిజాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి అతని కొట్టాలనిపిస్తుంది. ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఆ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు…
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో మ్యూజిక్ ఓకే అనిపించే విధంగా ఉంది. సస్పెన్స్ గొలిపే సీన్స్ చాలానే ఉన్నాయి. వాటికి బ్యాగ్రౌండ్ స్కోర్ కొంతవరకు ఇక విజువల్ గా కూడా ఈ సినిమా ఓకే అనిపించే విధంగా ఉంది విజువల్స్ ఏమీ లేకపోయినప్పటికీ సినిమా కథలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి విజువల్స్ కూడా తగ్గట్టుగానే ప్రేక్షకుడిని ఆ మూడ్లోకి తీసుకెళ్లి ముందుకు డ్రైవ్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది ఎక్కడైతే కొంచెం లాగ్ అయినట్టు అనిపించిందో అక్కడ ఎడిట్ కట్ చాలా షార్ప్ గా చేశారు…
ప్లస్ పాయింట్స్
కథ
మోహన్ లాల్ యాక్టింగ్
ట్విస్టులు
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ కొంచెం స్లో అయింది…
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.75/5