https://oktelugu.com/

Ajith Kumar: వరుసగా అజిత్ అకౌంట్లో మూడు అట్టర్ ఫ్లాప్ లు..? అంతా డైరెక్టర్ వల్లేనా?

ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ తో చేయడం కాస్త భయంగానే భావిస్తారు. అలాంటిది రెండు సినిమాలు ఫ్లాప్ అయినా మరో సినిమా ఛాన్స్ ఇచ్చి వరుస మూడు సినిమాలను ఫ్లాఫ్ అనిపించుకున్నాడు అజిత్. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 24, 2024 / 05:14 PM IST
    Follow us on

    Ajith Kumar: తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరో అయినా దక్షిణాదితో పాటు నార్త్ లోనూ ప్రభావాన్ని చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు థలా అజిత్ కుమార్. కెరీర్ ఆరంభంలోనే విలక్షణమైన నటన, విభిన్నమైన శైలి, పక్కా కమర్షియల్ సినిమాలతో స్టార్ డమ్ అందుకున్నాడు అజిత్. అప్పటి నుంచి ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకో ఈ సారి వచ్చినా సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి. అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అసలు అజిత్ కెరీర్ లో అలాంటి సినిమాలు ఏంటి? ఎందుకు డిజాస్టర్లు అయ్యాయి అనే వివరాలు మీకోసం…

    ఈ మధ్యకాలంలో అజిత్ కు సినిమాలు కలిసి రావడం లేదా అంటే అవును అనే చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయినా తెగింపు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. తమిళ అభిమానులను కాస్త మెప్పించినా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తెలుగులో ఈ సినిమాపై ఇప్పటికి ఎలాంటి అంచనాలు లేవు. దానికి తగ్గట్టుగానే టాక్ కూడా వచ్చింది. అయితే వరుసగా అజిత్ చేసిన మూడు సినిమాలు కూడా ఇలాగే అట్టర్ ఫ్లాప్ సినిమాలుగా మారాయి. ఈ మూడు సినిమాలను డైరెక్ట్ చేసింది ఒక్క డైరెక్టరే అని టాక్ వినిపిస్తుంది..

    ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ తో చేయడం కాస్త భయంగానే భావిస్తారు. అలాంటిది రెండు సినిమాలు ఫ్లాప్ అయినా మరో సినిమా ఛాన్స్ ఇచ్చి వరుస మూడు సినిమాలను ఫ్లాఫ్ అనిపించుకున్నాడు అజిత్. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. వాలిమై వచ్చిన తెగింపు సినిమాలతో అభిమానుల్లో అసహనం పెరిగింది. తెగింపు సినిమాను తమిళ్ లో బోని కపూర్ నిర్మిస్తే.. తెలుగులో దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాకు ముందు చాలా పెద్ద రబసే జరిగింది. డబ్బింగ్ సినిమాల విషయంలో దిల్ రాజు గతంలో ఇచ్చిన వర్షన్ మార్చుకోవడంతో అసలు గొడవ మొదలు అయ్యింది.

    అయితే తెగింపు సినిమాను డైరెక్ట్ చేసింది వి. వినోద్. 2019 లో పింక్ సినిమాను రీమేక్ చేస్తూ అజిత్ కుమార్ హీరోగా తొలిసారి విధి కాంబినేషన్ లో సినిమా వచ్చింది. అది పర్వాలేదు అనిపించింది. దీంతో మరొక సినిమాకు కమిట్ అయ్యారు. అదే వాలిమై.. ఇక 2022లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. మొదటి సినిమా ఆవరేజ్ టాక్, రెండోది దాదాపుగా ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా కూడా మూడవ సినిమాతో వినోద్ తో కమిటై అజిత్ తప్పు చేశాడు అంటున్నారు పలువురు. నమ్మకంతో మూడో సినిమా కమిట్ అయితే వరుసగా వచ్చిన మూడు సినిమాలు ఇలా ఫ్లాప్ అవడం అజిత్ కెరీర్ కే దెబ్బ పడే అవకాశం ఉంది అంటున్నారు కొందరు. దీనికి కారణం అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా తెగింపు సినిమా డిజాస్టర్ ఫలితాలను చవిచూడడమే అని టాక్.

    ఏది ఏమైనా వీలు అయినంత త్వరలో అజిత్ అభిమానులకు ఒక సాలిడ్ హిట్ ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు మరొక సినిమా కమిట్ అవలేదు అజిత్. నాలుగేళ్ల నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అజిత్ ఇప్పుడు సినిమా ఒప్పుకొని షూటింగ్ స్టాట్ చేసినా దాదాపుగా విడుదలకు మరో రెండేళ్లు పడుతుంది. అంటే మరో రెండు నుంచి మూడు సంవత్సరాలు అజిత్ అభిమానులు ఎదురుచూడక తప్పేలా లేదు అభిమానులకు.