Bigg Boss 5 Telugu: 12వ వారం బిగ్ బాస్ హౌస్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యాంకర్ రవి ఎలిమినేట్ కాగా ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు. అదే సమయంలో షోపై వ్యతిరేకత కూడా వ్యక్తమయింది. రవి ఎలిమినేషన్ లో వాస్తవం లేదని, ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేషన్ జరిగిందని ఆయన ఫ్యాన్స్ నిరసనకు దిగారు. తాజాగా రవి బిగ్ బాస్ షో గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేయడం జరిగింది.
ఓ వీడియో బైట్ విడుదల చేసిన రవి… ”షోలో జరిగేది వేరు, బయట చూపించేది వేరు. నేను ఇప్పుడు కొన్ని నిజాలు బయట పెడితే, అవునా అని మీరు షాక్ అవుతారు. అయితే నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను ఎవరిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయను. నేను ఓడిపోయి బయటికి వచ్చాను కాబట్టి అన్నీ మూసుకొని కూర్చున్నా. కానీ హౌస్ లో కొందరు గురించి చెప్పాలి. అయితే ఇప్పుడు నేను ఎవరి గురించీ మాట్లాడను. నా మాటలతో వాళ్ళ గేమ్ ని దెబ్బతీయడం, వెనక్కి లాగడం నేను చేయను. ఎందుకంటే నేను అలాంటి వ్యక్తిని కాదు”.
”షోకి వెళ్లబోయే ముందు నేను స్వయంగా చెప్పాను. నన్ను ట్రోల్ చేసుకోండని. కానీ నా భార్య నిత్యాను ఇన్వాల్వ్ చేశారు. చివరికి నా బిడ్డపై కూడా దారుణమైన కామెంట్స్ చేశారు. వీరందరూ డబ్బులు తీసుకుని లోపల వాళ్ళ కోసం పని చేస్తున్నారు. వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చెప్పను. ఇలా డబ్బులు తీసుకొని ట్రోల్స్ చేసేవాళ్ళు, చివరికి అదే డబ్బుల కోసం తల్లిదండ్రుల మీద కూడా ట్రోల్స్ వేస్తారు. లోపల ఒక గేమ్ నడుస్తుంటే బయట మరో గేమ్ నడుస్తుంది. లోపలి గేమ్ వీరి వలన ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటివి దయచేసి చేయకండి… నాకు కుటుంబానికి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు.. అంటూ రవి తన ఆవేదన తెలియజేశారు.
Also Read: Naga Chaitanya: ఈసారైనా నాన్న మాట విను చైతూ..!
రవి పరోక్షంగా తన ఎలిమినేషన్ అన్యాయం అన్నట్లు మాట్లాడారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఆయన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడంతో పాటు కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేశారని తెలిపారు. ఇదంతా డబ్బులు తీసుకొని హౌస్ లో ఉన్న కొందరు కంటెస్టెంట్స్ కోసం చేస్తున్నట్లు వివరించారు. మరి రవి ఆరోపణలు చేసిన ఆ కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాల్సి ఉంది.
Also Read: Saipallai: సాయిపల్లవి చెల్లెలు హీరోయిన్గా పరిచయమవుతున్న సినిమా రిలీజ్ ఈరోజే