Bigg Boss 9 Telugu: టెలివిజన్ రంగంలో సరికొత్త ట్రెండ్ కి తెరలేపిన రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. ఒకరితో మరొకరికి సంబంధం లేని కొంతమంది జనాలు కలిసి వంద రోజులపాటు ఒక హౌస్ లో ఉండి బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చిన టాస్క్ లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగిన వాళ్లకు అక్కడ మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన వారికి బయట కూడా మంచి క్రేజ్ అయితే లభిస్తుందని అందరు అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళ కెరియర్ లో పెద్దగా రాణించిన సందర్భాలైతే లేవు…బిగ్ బాస్ లో ఉన్నంత సేపే జనాలు వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉంటారు తప్ప బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. అనడానికి కౌశల్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అతను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కౌశల్ ఆర్మీ అంటూ హంగామా చేశారు. మొత్తానికైతే కౌశల్ బిగ్బాస్ సీజన్ 2 లో విన్నర్ గా నిలిచాడు…ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అతనికి చాలా మంచి క్రేజ్ అయితే లభించింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడి నుంచి అతనికి మంచి సపోర్ట్ లభించింది.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
అలాంటి కౌశల్ ఆ తర్వాత సినిమా హీరోగా పలు సినిమాలు చేసినప్పటికి ఆయనకు అంత పెద్దగా గుర్తింపైతే రాలేదు. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొచ్చిన తర్వాత సోహెల్ కూడా హీరోగా మారి పలు సినిమాలు చేసినప్పటికి ఆయన సినిమాలను చూడడానికి ఏ ప్రేక్షకుడు కూడా ఆసక్తి చూపించకపోవడం విశేషం… మరి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో రాణించిన సందర్భాలైతే కనిపించడం లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే కంటెస్టెంట్స్ అందరికీ తెలుస్తారు అంతే తప్ప సెపరేట్ క్రేజ్ అయితే ఏమిరాదు…
బిగ్ బాస్ అనేది కేవలం గేమ్ షో అందులో ఉన్నప్పుడు వాళ్ళ ఆడిన టాస్కులకు ప్రేక్షకులు కనెక్ట్ అయి వాళ్లకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంతేతప్ప వాళ్లు సినిమాలు చేస్తే చూస్తారని హీరోల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని అనుకోవడం మూర్ఖత్వం అవుతోంది. ఇక రియాల్టీని తెలుసుకున్న చాలామంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకుండా ఉండటమే మంచిదని నిర్ణయించుకుంటున్నారు…