Raveena Tandon: బాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ లేని హీరోయిన్ అంటే పెద్దగా గౌరవం ఉండదు. ఆమెను తక్కువ చేసి చూడటం, ఆమె గురించి బ్యాడ్ గా మాట్లాడటం హిందీ జనానికి బాగా అలవాటు. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అంటేనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్. తెలుగులో కూడా ఆమె ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.

కాగా ఇటీవల రవీనా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అప్పట్లో తన పై వచ్చిన పుకార్ల గురించి ఆమె తన మనసులోని మాటను చెప్పింది. రవీనా టాండన్ కొంతమంది హీరోలతో రిలేషన్ ఉన్నట్లు అనేక అవాస్తవాలను రాశారట. తన పై మీడియా రాసే పుకార్లు విని చాలా బాధ పడేది అట.
Also Read: వెబ్ సిరీస్ చేయబోతున్న సీనియర్ హీరోయిన్ !
ఇలాంటి వార్తలు రాయకండి అని ఎన్నిసార్లు అసహనం వ్యక్తం చేసినా.. అసలు ఎలా రాస్తారు అంటూ ఘాటుగా ప్రశ్నించినా మీడియా వాళ్ళు మాత్రం తనను ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే వచ్చారు అని ఆమె చెప్పుకొని బాధ పడింది. ఇక ఒకానొక సమయంలో అయితే, తన తమ్ముడితోనే తనకు సంబంధం ఉందని వార్తలు రాశారట. ఆ వార్తల కారణంగా తాను అప్పట్లో ఎంతో కృంగిపోయాను అని కూడా ఆమె ఎమోషనల్ అయింది.
రవీనా మాటల్లోనే.. ‘నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఒక్కోసారి నేను నిద్ర పోవడం కోసం ఎంతో ఏడ్చేదాన్ని. అలాగే నేను ప్రతి రోజు భయపడుతూనే బతికాను. ఏ పుకారు అయినా నా మీద రాగానే నేను చాలా బాధపడేదాన్ని. ఒక విధంగా ఆ పుకార్లు నా జీవితాన్ని నాశనం చేశాయి. చివరకు నా సొంత సోదరుడితో నాకు సంబంధం ఉందని పుకార్లు పుట్టించి నన్ను మానసికంగా చంపేశారు’ అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చింది.
Also Read: పెళ్లి అప్పుడే అంటూ క్లారిటీ ఇచ్చిన నటి సాయి పల్లవి… ఎప్పుడంటే ?