
Junior NTR: తారకరత్న మనమధ్య లేడన్న విషయం నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో దగ్గరి అనుబంధం ఉన్న నందమూరి వారసులు తారక్ తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. తారక్ ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆయనను కొంతమంది కుటుంబ సభ్యులు దూరం పెట్టారని అన్నారు. కానీ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు నిత్యం తారక్ బాగోగులను చూస్తుండేవారని చెప్పుకుంటున్నారు.
ఇక తారక్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ఇప్పటికే తెలిసింది. గుండెపోటుతో తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ నిత్యం టెన్షన్ తో కనిపించారు. తారక్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేశారు. కానీ దురదృష్టవశాత్తూ తారక్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అయితే కొందరు వీరిద్దరి మధ్య పోటీ ఉందని, జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా తారక్ ను తీసుకొచ్చారని ప్రచారం చేశారు. కానీ వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. అదేంటో చూద్దాం..
నందమూరి ఎన్టీరామారావు వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన ఎన్టీఆర్ పోలికలతో ఉండడంతో సినీ ప్రేక్షకులు ఆదరించారు. అలా వరుస సినిమాలు చేసిన జూనియర్ ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకరయ్యారు. అయితే నందమూరి వంశానికి చెందిన వారిలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా తారకరత్నను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారని అంటున్నారు. అందుకే ఒకేసారి 9 సినిమాలు స్ట్రాట్ చేసి రికార్టు నెలకొల్పించారని చెబుతున్నారు. కానీ తారక్, జూనియర్ ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ విషయం ఇప్పటికే తెలియడంతో వీరి మధ్య తగువు పెట్టిన వాళ్లు నొచ్చుకుంటున్నారు. ఇప్పడు మరోసారి తారకరత్న విషయంలో ఎన్టీఆర్ చేసిన పనికి విమర్శకులు సిగ్గుపడుతున్నారు.
ఇటీవల నందమూరి కుటుంబ సభ్యులు కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఇంటిని పరిశీలిస్తున్నప్పుడు గోడకు కొన్ని ఫొటోలు కనిపించాయి. వాటిల్లో ఒకటి కర్ణాటక దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ ది ఉంది. ఆ ఫొటో పైన తారకరత్న చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు వారిద్దరు అంటే చాలా ఇష్టమట. అందుకే వారిని ప్రత్యేకంగా ఫొటో ప్రేమ్ లో బంధించి అపురూపంగా చూసుకుంటున్నారట. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నారు.

ఈ ఫొటోలను చూసి ఇంతకాలం తారక్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య చిచ్చు పెట్టిన వాళ్లు సిగ్గుపడుతున్నారు. వీరి మధ్య ఇంత అభిమానం ఉంటే శత్రుత్వం ఉందంటూ ప్రచారం చేసిన వాళ్లు సైలెంట్ అయిపోయారు. ఇక తారక్ బతికున్న రోజుల్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తనకు రూ.4 లక్షలు ఇచ్చి సాయం చేశాడని చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియోను బయటకు తీసి ప్రచారం చేస్తున్నారు. ఏదీ ఏమైనా వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా అన్నదమ్మల మధ్య తగువు పెట్టడం సరికాదని నందమూరి అభిమానులు వాపోతున్నారు.