Homeజాతీయ వార్తలుKCR- Kavitha: కవిత అరెస్టు ఖాయమైందా? కేసిఆర్ అత్యవసర భేటీ అందుకేనా? గులాబీ బాస్ నెక్ట్...

KCR- Kavitha: కవిత అరెస్టు ఖాయమైందా? కేసిఆర్ అత్యవసర భేటీ అందుకేనా? గులాబీ బాస్ నెక్ట్ స్టెప్ ఎంటి!?

KCR- Kavitha
KCR- Kavitha

KCR- Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఖాయం అయిందా.. ఈడీ డేట్ ఫిక్స్ చేసిందా.. అంటే బీఆర్ ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవిత మినహా కేసుతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు ప్రస్తుతం జైల్లో ఎన్నారు. ఈడీ నెక్స్ట్ టార్గెట్ కవితే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ప్రగతిభవన్‌లో పలువులు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అత్యవసర భేటీ కవిత అరెస్ట్ పైనే అన్న చర్చలు ఊపందుకున్నాయి.

అరెస్టు చేస్తే ఏం చేద్దాం..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితని అరెస్ట్ చేస్తే ఏం చేయాలి అన్న విషయం పైనే సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు.. ఇప్పటికే కవితకు సన్నిహితంగా ఉన్న బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశాయి. వారంతా జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. బెయిల్ కూడా రావడం లేదు. ఈ క్రమంలో కవితను అరెస్టు చేస్తే ఏం చేద్దామనే విషయంపై ఈ మీటింగ్‌లో ప్రధానంగా కేసిఆర్ డిస్కస్ చేసినట్టు సమాచారం.

లీగల్‌గా ఫైట్.. పొలిటికల్‌ సింపతీ..
కవిత అరెస్ట్ అయితే న్యాయ పోరాటం చేయడంతో పాటు.. లోక్కర్ స్కాం ప్రభావం పార్టీకి మైనస్ కాకుండా కూడడం… వీలైతే కవిత అరెస్ట్ తో పార్టీకి సింపతీ వచ్చేలా చేయడంపై చర్చించినట్టు సమాచారం. మరో వైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు పెంచాలని ఆదేశించినట్లు సమాచారం. కేంద్రాన్ని విమర్శించినందుకే కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్టు చేశారని ప్రచారం చేసుకోవాలని కవిత భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లోనూ చర్చ నడుస్తున్నది.

అరెస్ట్ ప్రభావం ఎలా ఉంటుందో..
మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా కవితను విచారణకు పిలిచినా.. ఉద్దేశపూర్వకంగా ఆమెను అరెస్టు చేసినా ఆ ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉండనుంది? పార్టీ కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? రానున్న ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతున్నది? తదితరాల విషయాలపై కేసిఆర్ విస్తృతంగానే చర్చించిన్నట్టు తెలిసింది. లీగల్‌గా ఎలా ఫైట్ చేయాలి? రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి? ఫ్యామిలీతో పాటు కుటుంబ సభ్యులపై పడే ప్రభావం తదితరాలపైనా మంతనాలు సాగినట్లు సమాచారం.

KCR- Kavitha
Kavitha

బీజేపీని ఢీకొట్టడం ఎలా?
పొలిటికల్‌గా కేంద్రంలోని బీజేపీని ఎలా ఢీకొట్టాలనే విషయంపైనా పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరంపైనా ఈ భేటీలో చర్చలు జరిగినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కెసిఆర్ సూచించారని తెలిసింది.

మంత్రులు.. ఎమ్మెల్యే ల్లో ఆందోళన
లిక్కర్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు, కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లు, అందులో సీబీఐ, ఈడీ లేవనెత్తిన అంశాలు, నిందితులపై మోపిన అభియోగాలు తదితరాలన్నింటిపై మంత్రులు, ఎమ్మెల్యే ల్లో ఆందోళన మొదలైంది. తాజాగా కేసిఆర్ నిర్వహించిన అత్యవసర సమావేశం మరింత టెన్షన్ పెంచింది.

మొన్న సాక్షిగా.. రేపు నిదితురాలిగా..
కవితను సీబీఐ గతేడాది డిసెంబరు 11న లిక్కర్ స్కాంలో ఒక సాక్షిగా ప్రశ్నించడం సంచలనంగా మారింది. అది ముగిసిన వెంటనే సీఆర్‌పీసీలోని సెక్షన్ 191 ప్రకారం మరో నోటీసు జారీ చేయడం చర్చకు దారితీసింది. ఆ తర్వాత వచ్చిన చార్జిషీట్లలో కవిత పేరును సీబీఐ, ఈడీ పదేపదే ప్రస్తావించడం, మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఆరోపించడం, కిక్ బ్యాక్‌‌ల పేరుతో ముడుపులు ఇవ్వడం, వైన్ షాపులకు లైసెన్సులు పొంది లాభాలు ఆర్జించడం, పాలసీ రూపకల్పనలోనే కవితతో పలువురు చర్చలు జరపడం.. ఇలా అన్నింటిలో ఎమ్మెల్సీ ప్రమేయం ఉందన్న అనుమానాలను బలపరిచినట్లయింది. ఇప్పటికే కవితకు సన్నిహితంగా ఉన్న బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేయడంతో.. దర్యాప్తు సంస్థల నుంచి కవితకూ అలాంటి ముప్పు ఉంటుందని గులాబీ పార్టీలో గుసగుసలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. తాజా సమావేశం తో అరెస్ట్ త్వరలో ఉంటుందని భావిస్తున్నారు. అరెస్టు తర్వాతి పరిణామాలు, దాని ప్రభావం కుటుంబంపైనా, పార్టీపైనా, ఎన్నికలపైనా ఎలా పడుతుందో అనే గుబులు ప్రస్తుతం కేసీఆర్ స్థాయిలోనూ మొదలైనట్టు సీనియర్ నేతల ద్వారా తెలిసింది. ఊహించని పరిస్థితే ఎదురైతే ఒకవైపు లీగల్‌గా ఫైట్ చేయడానికి ఉన్న మార్గాలతో పాటు పొలిటికల్‌గా ఎదుర్కొనే వ్యూహం గురించి ఎమర్జెన్సీ మీటింగ్‌లో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది.

అందుకే ఈమధ్య కేసిఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు కేంద్రం, సీబీఐ, ఈడీ టార్గెట్ గా మాట్లాడుతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version