Suman Shetty: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో చాలామంది కమెడియన్స్ వాళ్లకు ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే జయం సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు సుమన్ శెట్టి…ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో కమెడియన్ గా అతనికి చాలా మంచిన్గుర్తిమోయిటే వచ్చింది…ఆ తర్వాత మంచి సినిమాలను చేసి తనను తాను స్టార్ కమెడియన్ గా ఎలివేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలు నుంచి ఆయనకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అవకాశాలు అయితే రావడం లేదు. దానివల్ల ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ తన కెరీర్ నైతే సాగిస్తున్నాడు. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా వచ్చిన ఆయనకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ అయితే లభిస్తోంది. ముఖ్యంగా ఆయన చేస్తున్న ప్రతి టాస్క్ లో కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి తనకు ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే లభిస్తోంది… గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది.
అతనికి సినిమా అవకాశాలు రాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే జబర్దస్త్ షో రావడమే అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ షో వల్ల చాలామంది కమెడియన్స్ ఇండస్ట్రీకి వచ్చారని వాళ్ల వల్ల తనకు అవకాశాలు లేకుండా పోయాయని టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో చాలా పాపులారిటిని సంపాదించుకొన్నారు.
వాళ్లకు చాలా మంచి క్రేజ్ రావడం వల్ల తనను రీప్లేస్ చేస్తూ జబర్దస్త్ నటులను ఎక్కువగా తీసుకున్నారు అంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా ఆయన క్రేజ్ ను పెంచుకొని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
గతంలో ఆయన జయం, ధైర్యం,నిజం, హ్యాపీ, 7/G బృందావన కాలనీ, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలను చేశాడు…ఇక ఇప్పుడు ఆయన మరోసారి బిగ్ బాస్ షో ద్వారా సినిమా అవకాశాలను అందుకొని తనను తాను స్టార్ కమెడియన్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…