Sandeep Vanga: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది దర్శకులు మాత్రం చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి వాళ్ల హావ భావాల్లో గాని, వాళ్ళు హీరోలను ఎలివేట్ చేసి చూపించడంలో గాని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన శైలి అయితే ఉంటుంది. ఇక అందులో సందీప్ రెడ్డి వంగ మొదటి స్థానంలో ఉంటాడు… అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చిన ఆయన ఆ తర్వాత చేసిన అనిమల్ సినిమాతో రణ్బీర్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించాడు.
900 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా యూత్ లో మంచి ఫాలోయింగ్ ను అయితే సంపాదించుకుంది. మరి ఇలాంటి సందర్భంలోనే సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం మొదటి దీపికా పదుకొనే ను హీరోయిన్ గా సంప్రదించినప్పటికి ఆమె పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకోలేకపోయిన సందీప్ రెడ్డి వంగ ఆమెను తీసేసి త్రిప్తి డిమ్రి ని హీరోయిన్ గా తీసుకున్నాడు.
అయితే అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగను విమర్శిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కథనాలైతే వెలువడ్డాయి. కానీ ఇప్పుడు ‘కల్కి 2’ సినిమా నుంచి కూడా దీపిక ను తీసేయడం పట్ల చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా దీపిక పదుకొనే విషయంలో కరెక్ట్ గానే ఉన్నాడు అంటూ అతని తప్పేమీ లేదు.
కేవలం ఆమె అన్ని కండిషన్స్ పెట్టి సందీప్ కి చిరాకు తెప్పించింది. అందుకే అతను ఆమెను సినిమా నుంచి తీసేశాడు. ఇక కల్కి 2 విషయంలో కూడా అదే జరిగింది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక మొత్తానికైతే సందీప్ రెడ్డివంగ అభిమానులైతే చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే దీపిక విషయంలో సందీప్ ముందుగానే పసిగట్టి తనను ముందే తీసేసి మంచి పని చేశాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…