https://oktelugu.com/

Actress: ఒకప్పుడు డైపర్లు మార్చిన ఈ యువతి ఇప్పుడు వంద కోట్ల హీరోయిన్..

ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా రూ. 215.50 కోట్లను వసూలు చేసింది. ధోని భార్య రోల్ తో ఆకట్టుకున్న కియారా, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2024 / 06:25 PM IST
    Follow us on

    Actress : సినీ ఇండస్ట్రీలో పేరు సంపాదించడం అంత ఈజీ కాదు. ఎన్నో కష్టాలు అనుభవించి స్టార్ స్టేటస్ ను అందుకునే వారు ఎక్కువ మంది ఉంటారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఇలా కష్టపడి పైకి వచ్చిన వారి లిస్ట్ చాలా పెద్దగానే ఉందండోయ్. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్ లు కూడా ఎన్నో కష్టాలు అనుభవించి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ను అందుకున్న వారు కూడా ఉన్నారు. ముందు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి వారిలో ఒకరు ఏకంగా ఇప్పుడు వంద కోట్ల హీరోయిన్ గా ఎదిగింది.

    అనుకోకుండా సినీ రంగంలోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కియారా అద్వానీ. ఒకప్పుడు ప్రీ-స్కూల్ టీచర్ గా పనిచేసి స్కూల్ పిల్లలకు డైపర్లు మార్చిందట ఈ స్టార్ నటి. కానీ నేడు పాపులర్ బాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకొని లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తోంది. బాలీవుడ్ ను శాసిస్తున్న హీరోయిన్ లలో ఒకరిగా నిలిచింది. మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది. కానీ ఒక ఫ్లాప్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

    ఆ తర్వాత ఎన్నో హిట్లు, సూపర్ క్రేజ్ లను సంపాదించుకొని ఇప్పుడు స్టార్ గా ఎదిగింది. కానీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేకంటే ముందు పిల్లలకు డైపర్లు మార్చాను అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది కియారా. ఉదయం 7 గంటలకు ప్రీస్కూల్ కి వెళ్లి పిల్లల కేరింగ్ చూసుకునేదట. చిల్డ్రన్ మేనేజ్మెంట్ కోసం చేయాల్సిని పనులు అన్నీ చేసేదట. నర్సరీ రైమ్స్ పాడటం, లెటర్స్, నంబర్స్ నేర్పించడం, డైపర్లు మార్చడం వంటివి చేసేదట. కానీ ఇప్పుడు ఆమె ఇంట్లోనే పని వాళ్లు ఉంటారు.

    టీమిండియా మాజీ కెప్టెన్ ధోని బయోపిక్ ఎమ్. ఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో సాక్షి పాత్రతో యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో కియారా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో నటించి సూపర్ హిట్ ను సంపాదించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా రూ. 215.50 కోట్లను వసూలు చేసింది. ధోని భార్య రోల్ తో ఆకట్టుకున్న కియారా, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.