https://oktelugu.com/

OTT Releases: ఓటీటీలో ప్రభాస్, థియేటర్స్ లో చిరు… ఈ వారం మోత మోగాల్సిందే! ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

ఈ ఈవారం ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి సందడి అని చెప్పాలి. ఓటీటీలో ఒకరు, థియేటర్స్ లో మరొకరు సందడి చేయనున్నారు. ఆ సినిమాలు ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 19, 2024 / 04:50 PM IST

    OTT Releases

    Follow us on

    OTT Releases: ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు ధియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. ఈ వీకెండ్ కూడా కొన్ని క్రేజీ సినిమాలు మూవీ లవర్స్ కోసం సిద్ధమవుతున్నాయి. పెద్ద సినిమాలేవీ ఈ వారం రిలీజ్ కావడం లేదు. కానీ చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి. ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినం పురస్కరించుకుని మురారి విడుదల చేశారు. త్వరలో మరో స్టార్ హీరో బర్త్ డే ఉండగా… బ్లాక్ బస్టర్ మూవీస్ ఆడియన్స్ ని అలరించేందుకు తిరిగి థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. అలాగే ఓటీటీలో సైతం కొత్త సినిమాలు, సిరీస్ రిలీజ్ కానున్నాయి.

    థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు వివరాలు పరిశీలిస్తే.. ‘ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ‘ విడుదలకు సిద్ధమైంది. రావు రమేష్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 23న రిలీజ్ కానుంది. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కీలక పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇది ఓ మధ్య తరగతి నిరుద్యోగి కథ. అతని జీవితంలో అడుగడుగునా ఎదుర్కొనే సంఘటనలు, చోటు చేసుకునే మలుపులు 2 గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి అని మూవీ టీం చెబుతుంది.

    డిమాంటి కాలనీ 2 సైతం విడుదల అవుతుంది. అరుల్ నిధి, ప్రియ భవాని శంకర్ హీరో, హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 15న తమిళంలో విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ నెల 23న ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ ఓ ఇంటి చుట్టూ ఈ కథ అంతా తిరుగుతుంది. ఆ కాలనీ లో వాళ్ళందరూ ఆ ఇల్లంటే భయపడుతూ ఉంటారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో, తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అజయ్ ఆర్. జ్ఞాన మత్తు డైరెక్ట్ చేశారు.

    స్టార్ హీరోల బర్త్ డే లకు వారి బ్లాక్ బస్టర్ చిత్రాలు రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదినం కాగా… బ్లాక్ బస్టర్ సినిమాలు రెండు విడుదల అవుతున్నాయి. ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి ప్రధాన పాత్రలు పోషించిన యజ్ఞ. అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా నటించిన ‘ వెడ్డింగ్ డైరీస్ ‘ ధియేటర్స్ లో సందడి చేయనున్నాయి.

    ఇక ఓటీటీ విషయానికి వస్తే ..
    నెట్ ఫ్లిక్స్

    ఇన్ కమింగ్ -హాలీవుడ్ – ఆగస్టు 23
    ది ఫ్రాగ్ కొరియన్ – ఆగస్టు 24

    అమెజాన్ ప్రైమ్

    యాంగ్రీ యంగ్ మ్యాన్ ది సలీమ్ జావేద్ స్టోరీ హిందీ సిరీస్ – ఆగస్టు 20
    ఫాలో కర్లో యార్ రియాలిటీ షో – ఆగస్టు 23
    కల్కి 2898 ఏడీ – ఆగస్టు 23
    రాయన్ తెలుగు – ఆగస్టు 23

    హెచ్ బి ఓ మ్యాక్స్

    బిజీ ప్రిసీక్ట్ కొరియన్ – ఆగస్టు 22
    లయన్స్ గేట్ ప్లే
    ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నర్స్ తెలుగు డబ్బింగ్ – ఆగస్టు 23

    జియో సినిమా

    డ్రైవ్ ఎవే డాల్స్ హాలీవుడ్ – ఆగస్టు 23
    యాపిల్ టీవీ ప్లస్ పాచింకో కొరియన్ – ఆగస్టు 23

    హాట్ స్టార్
    గర్ర్ మలయాళం / తెలుగు – ఆగస్టు 20