https://oktelugu.com/

OTT Releases: సినిమా ప్రియులకు పండగే… ఈ వారం థియేటర్స్/ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్లు ఇవే! డోంట్ మిస్

వారాంతం వచ్చిందంటే సినిమా ప్రియులకు పండగే. థియేటర్స్ లో కొత్త చిత్రాల సందడి నెలకొంటుంది. మరోవైపు ఓటీటీలో అన్ లిమిటెడ్ కంటెంట్. ఈ వారం 12 సినిమాలు/సిరీస్ల వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : September 2, 2024 / 02:51 PM IST

    OTT Releases

    Follow us on

    OTT Releases: తెలుగులో పెద్ద చిత్రాల విడుదల ఇప్పట్లో లేదు. సెప్టెంబర్ 27న దేవర వచ్చే వరకు ఈ మూడు వారాలు స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్నాయి. అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ లేటెస్ట్ మూవీ గోట్ విడుదలకు సిద్ధమైంది. విజయ్ కి టాలీవుడ్ లో సైతం మార్కెట్ ఉంది. ఈ క్రమంలో గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సెప్టెంబర్ 5న విడుదల కానుంది.

    వెంకట్ ప్రభు ఈ చిత్ర దర్శకుడు. రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయ్ డ్యూయల్ రోల్ చేయడం విశేషం. విజయ్ చివరి చిత్రం ఇదే అనే ప్రచారం జరుగుతుంది. భారీ క్యాస్ట్ ఈ మూవీలో నటించారు. వరుస విజయాలతో ఊపుమీదున్న హీరో సుహాస్ నుండి వస్తున్న మరో డిఫరెంట్ మూవీ జనక అయితే గనక. ఈ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి రానుందని సమాచారం.

    గోట్, జనక అయితే గనక చిత్రాలతో పాటు నివేద థామస్ నటించిన 35 చిన్న కథ కాదు మూవీ థియేటర్స్ లో విడుదల అవుతుంది. ఈ మూడు చిత్రాలు ఈ వారం థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఇక ఓటీటీలో పలు చిత్రాలు, సిరీస్లు మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేయనున్నాయి. వాటిలో ఆసక్తి రేపుతున్న చిత్రం కిల్. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. బాలీవుడ్ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కిల్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 6 నుండి స్ట్రీమ్ కానుంది.

    ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలు/సిరీస్లు ఇవే..

    నెట్ఫ్లిక్స్
    ది పర్ఫెక్ట్ కపుల్-ఇంగ్లీష్ వెబ్ సిరీస్-సెప్టెంబర్ 05
    అపోలో 13- సర్వైవల్ డాక్యూమెంటరీ- సెప్టెంబర్ 05
    బ్యాడ్ బాయ్స్- ఇంగ్లీష్ మూవీ- సెప్టెంబర్ 06
    రెబల్ రిడ్జి-ఇంగ్లీష్ మూవీ-సెప్టెంబర్ 06

    అమెజాన్ ప్రైమ్
    కాల్ మీ బేబీ- హిందీ వెబ్ సిరీస్-సెప్టెంబర్ 06

    జియో సినిమా
    ది ఫాల్ గయ్ – ఇంగ్లీష్ మూవీ-సెప్టెంబర్ 0 3

    డిస్నీ ప్లస్ హాట్ స్టార్
    బ్రిక్ ట్యూన్స్-ఇంగ్లీష్ మూవీ-సెప్టెంబర్ 04
    కిల్-హిందీ మూవీ-సెప్టెంబర్ 06

    సోనీ లివ్
    తనావ్-పార్ట్ 2- సీజన్ 1- హిందీ సిరీస్- సెప్టెంబర్ 06

    లయన్స్ గేట్ ప్లే
    ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ – సెప్టెంబర్ 06
    ది ఎటర్నల్ డాటర్ – ఇంగ్లీష్ మూవీ- సెప్టెంబర్ 06
    ది వెలరియన్ అండ్ది సిటీ ఆఫ్ థౌసండ్ ప్లానెట్స్ – ఇంగ్లీష్ మూవీ- సెప్టెంబర్ 06