Mass Jathara Collection Day 4: ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్స్ కంటే పెద్ద మార్కెట్ ని మైంటైన్ చేస్తూ, భారీ రెమ్యూనరేషన్స్ ని అందుకునే హీరో రవితేజ(Mass Maharaja Raviteja). ఆయన సినిమా వచ్చిందంటే చాలు, టాక్ తో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ కి బలమైన నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆయన అలాంటి సినిమాలు చేసాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తే, అందులో కచ్చితంగా రెండు హిట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి ఆయన పూర్తిగా దూరం అయిపోయాడు. స్టార్ హీరో గా నేడు తిరుగులేని స్థానం లో ఉండాల్సిన రవితేజ, ఇప్పుడు మార్కెట్ మొత్తం కోల్పోయే పరిస్థితి కి వచ్చేసాడు. ‘ధమాకా’ తర్వాత ఆయన చేసిన ఆరు సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన ‘మాస్ జాతర'(Mass Jathara Movie) అయినా హిట్ అవుతుందేమో అని ఆయన అభిమానులు ఆశపడ్డారు.
కానీ అభిమానులకు తన 75వ సినిమాతో చేదు జ్ఞాపకాలను మిగిలించాడు రవితేజ. తన ప్రతీ సినిమా విడుదల తర్వాత, ఎలాంటి టాక్ వచ్చిన మీడియా ముందుకొచ్చి మా సినిమా బంపర్ హిట్ అనడం, రివ్యూయర్స్ పై సెటైర్స్ వేయడం వంటివి అనాదిగా జరుగుతూ వస్తూనే ఉన్నాయి. అలాంటి నాగవంశీ ఈ సినిమా విడుదల తర్వాత అసలు కనిపించడం లేదు. అయితే థియేటర్స్ లో విడుదలై 4 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలవారీగా ఎంత షేర్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతంలో 3 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి కోటి 28 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 3 కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 7 కోట్ల 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో కేవలం 45 లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ ప్రాంతం లో కనీసం ప్రింట్ డెలివరీ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది. కానీ రవితేజ గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ తో పోలిస్తే కాస్త ఎక్కువ వచ్చాయి అనే చెప్పాలి. ఓవరాల్ గా నాలుగు రోజుల్లో 8 కోట్ల 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, 16 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. ఇది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే మరో రెండు కోట్ల షేర్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం రాబట్టగలదు.