Two Or Three Love couples In Bigg Boss6: బిగ్ బాస్ హౌస్ ప్రేమకథలకు పుట్టినిల్లు. ఒంటరిగా వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు జంటలుగా మారిపోతారు. గత ఐదు సీజన్స్ గమనిస్తే చాలా ప్రేమకథలు బిగ్ బాస్ హౌస్ లో పుట్టాయి. నాలుగు గోడల మధ్య ప్రేమపక్షులుగా విహరించిన సెలెబ్రిటీలు చాలా మందే ఉన్నారు. రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్-మోనాల్ గజ్జర్, అభిజీత్-హారిక, మానస్-ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో కెమెరాల ముందు పబ్లిక్ గా రొమాన్స్ కురిపించారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కాగా హౌస్ లో మొదలయ్యే ప్రేమకథలపై ఆసక్తి పెరిగిపోయింది. హౌస్ లోకి ప్రవేశించిన ఒకరిద్దరు కంటెస్టెంట్స్ ముందుగానే తమకు లవర్స్ ఉన్నట్లు చెప్పేశారు. జబర్దస్త్ ఫేమ్ ఫైమా తాను ప్రవీణ్ అనే అబ్బాయిని ఘాడంగా ప్రేమిస్తున్నట్లు వేదికపైనే ఒప్పేసుకుంది. తల్లి లేని ప్రవీణ్ తనలో తల్లిని చూసుకుంటాడని, అప్ అండ్ డౌన్స్ లో తోడుగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ప్రవీణ్ ఫాదర్ కూడా చనిపోయాడు. ఈ సందర్భంలో నేను తోడుగా ఉంటే బాగుండేది. అయితే నువ్వు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకురావడమే నాకు పెద్ద ఓదార్పని చెప్పాడని, వేదికపై ఫైమా వివరించింది.

మరో కంటెస్టెంట్ శ్రీహాన్ చాలా కాలంగా నటి సిరితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. సిరి బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని ఫైనల్ కి వెళ్లారు. సిరి హౌస్ లో ఉన్న సమయంలో శ్రీహాన్ ఆమెను పలకరించడానికి వచ్చాడు. లేటెస్ట్ సీజన్లో శ్రీహాన్ హౌస్లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేశారు. ఆల్రెడీ లవర్స్ ఉన్న శ్రీహాన్, ఫైమా హౌస్ లో అఫైర్స్ పెట్టుకోక పోవచ్చు. కానీ ఈ సీజన్ కంటెస్టెంట్స్ ని గమనిస్తే కనీసం నాలుగైదు కొత్త జంటలు తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పెళ్లి కానీ యంగ్ బ్యూటీస్, హ్యాండ్సమ్ బాయ్స్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. నటుడు అర్జున్ కళ్యాణ్ ఎంట్రీలోనే హింట్ ఇచ్చాడు.లైఫ్ లో లెక్కకు మించిన గర్ల్ ఫ్రెండ్స్ ని మైంటైన్ చేశానన్నాడు. ఇక హౌస్ లోకి వెళుతూనే మోడల్ శ్రీసత్యతో రొమాంటిక్ గా చాక్లెట్ షేర్ చేసుకున్నాడు. హౌస్ లో ఉన్న అందమైన అమ్మాయిల్లో ఒకరిని ఇతడు బుట్టలో వేసుకోవడం ఖాయం. ఆర్జే సూర్య, మోడల్ రాజశేఖర్ సైతం సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుండగా పెళ్లికాని అమ్మాయిలతో మింగిల్ అయ్యే సూచనలు కలవు.

ఇనయ సుల్తానా, వసంతి కృష్ణన్, కీర్తి భట్, గీతూ రాయల్, శ్రీసత్య, నేహా చౌదరి, సుదీప ఇలా అరడజనుకు పైగా అందమైన అమ్మాయిలు హౌస్ లో అడుగుపెట్టారు. ఈ గ్లామరస్ కంటెస్టెంట్స్ లవ్ బర్డ్స్ గా మారి నాన్ స్టాప్ రొమాన్స్ పంచుతారనడంలో సందేహం లేదు. ఇప్పుడే కథ మొదలు కాగా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ…