Bigg Boss Telugu 6 Inaya Sultana: బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ లోకి ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇనయా సుల్తానా కూడా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఎవరీ ఈ ఇనయా సుల్తానా ?, ఆ మధ్య ఆర్జీవీతో కలిసి ఓ పాటకు స్టెప్స్ వేసింది. ఆర్జీవీ ఈ అమ్మడు పాదాలకు ముద్దులు పెట్టి.. మొత్తానికి ఈ భామను ట్రెండింగ్ లిస్ట్ లోకి తీసుకొచ్చాడు. ఫలితంగా ఇనయా సుల్తానాకి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో ఛాన్స్ వచ్చింది. మరి ఈ ఇనయా సుల్తానా గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఇనయా సుల్తానా 1995వ సంవత్సరం ఆగస్టు 21న హైదరాబాద్ లో పుట్టింది. చిన్నతనం నుంచి సినిమా హీరోయిన్ కావాలని కలలు కన్నది. చదువు కంప్లీట్ చేసుకుని.. మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మోడల్ గా బాగానే రాణించింది. ఈ క్రమంలోనే తెలుగులో పలు సినిమాలు కూడా చేసింది. ‘బుజ్జి ఇలా రా, నటరత్నాలు… యద్భావం తద్భవతి వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ.. ఆమెకు హిట్ దక్కలేదు.
దీనికితోడు ఇనయా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చింది. అందుకే, ఆమె ప్రస్తుతానికి తన ఫ్యామిలీకి పూర్తి దూరంగా ఉంటుంది. కోవిడ్ టైంలో ఇనయా నాన్న గారు చనిపోయాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఆమె తన ఇంటికి వెళ్లలేకపోయింది. వంద రూపాయలతో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ఇనయా, ఇల్లు వదిలి ఇప్పటికే మూడేళ్లవుతోంది. ఐతే, సినిమాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఆర్జీవీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగా ఆమె తన బర్త్ డే పార్టీకి ఆర్జీవీని పిలిచింది. ఆ పార్టీలోనే ఆర్జీవీకి నచ్చిన పాటలు ప్లే చేస్తే.. ఆయన స్టెప్స్ వేశారు.

అందులో ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ, ఆ వీడియో చూసి ఇనయా ఇంట్లోవాళ్లు, బంధువులు ఆమెను అసహ్యించుకున్నారట. ఇక పోర్న్ వీడియోలు చేసుకో అంటూ ఆమెను దూషించారట. ఇన్నీ అవమానాల మధ్య చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ హీరోయిన్‌గా ఎదిగింది. తనకు దక్కిన క్రేజ్ ను పెంచుకోవడానికి.. గ్లామర్ షో లో ఏమాత్రం హద్దులు లేకుండా రెచ్చిపోయింది. వెరీ బోల్డ్ ఫోటో షూట్లు చేసింది.
దాంతో సోషల్ మీడియాలో బాగానే ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మరి ఇనయా సుల్తానా హౌస్ లో ఏ రేంజ్ లో పోటీ పడుతుందో ?, ఏ స్థాయిలో యూత్ కి వేడి పుట్టిస్తుందో చూడాలి.