Star Director: హీరోయిన్ల విషయంలో అసలు పట్టించుకోని ఈ స్టార్ డైరెక్టర్…

Star Director: హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన ఏమాత్రం కేర్ తీసుకున్నట్టుగా కనిపించదు. ఆయన గత సినిమాలు చూస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టం గా అర్థమవుతుంది.

Written By: Gopi, Updated On : January 19, 2024 1:19 pm
Follow us on

Star Director: కే జి ఎఫ్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈయన తీసిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అయింది. ఇక రీసెంట్ గా ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తాడు అలాగే తన కథకి హీరోని ఎంచుకోవడంలో కూడా ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటాడు.

కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన ఏమాత్రం కేర్ తీసుకున్నట్టుగా కనిపించదు. ఆయన గత సినిమాలు చూస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టం గా అర్థమవుతుంది. భారీ బడ్జెట్ తో తీసిన కే జి ఎఫ్ సినిమాలో కూడా శ్రీనిధి శెట్టి లాంటి ఒక ఆర్డినరీ హీరోయిన్ ని తీసుకొచ్చాడు. ఇక సలార్ లాంటి సినిమాలో శృతి హాసన్ ను తీసుకొని అందరిని షాక్ కి గురి చేశాడు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలో హీరోయిన్ అంటే చాలా మంది ఫ్యాన్స్ చాలా రకాలుగా ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉంటారు.

కానీ వాటన్నిటినీ బ్రేక్ చేస్తూ ప్రశాంత్ నీల్ శృతిహాసన్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్య పోయారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత శృతి హాసన్ కొంతవరకు పర్లేదు అన్నట్టుగా నటించి మెప్పించింది. ఇక ఇలాంటి క్రమంలో ఎన్టీయార్ తో చేసే సినిమాలో ఏ హీరోయిన్ ను తీసుకుంటాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎన్టీయార్ తీయబోయే సినిమా భారీ లెవెల్లో ఉండబోతుంది.

కాబట్టి ఈ సినిమాకి బాలీవుడ్ నుంచి హీరోయిన్ ను తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఏ హీరోయిన్ ను బరిలోకి దింపుతాడు అనేది…ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ప్రశాంత్ నీల్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకుంటాడు. రాజమౌళి తర్వాత ఆయనే టాప్ 2 లో నిలుస్తాడు..