Golconda High School: చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చాలా మంది పెరిగి పెద్దయ్యాక హీరోలుగా మారారు. కొందరు స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుంటే మరికొందరు ఆ ఇమేజ్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కొనసాగుతున్న కొందరు తమ వారసులను చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేశారు. ఆ తరువాత వారికి మంచి భవిష్యత్ కు దారి చూపించారు. ఇలాగే ఓ సక్సెస్ ఫుల్ సినిమా తీసిన డైరెక్టర్ తన కుమారుడిని చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత ఆ కుర్రాడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? తన కుమారుడు ఎవరు?
క్రికెట్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు హిట్టు కొట్టాయి. అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్’ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ సాధించింది. ఇదే కోవలో తెలుగులో క్రికెట్ నేపథ్యంలో 2011లో వచ్చిన మూవీ ‘గోల్కోండ హైస్కూల్’. స్కూల్ క్రికెట్ ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ మంచి పేరు తెచ్చుకుంది. సుమంత్ హీరోగా నటించిన ఇందులో కొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. వారిలో సంగీత్ శోభన్ ఒకరు.
బొద్దుగా.. కాస్త డీ గ్లామర్ గా వరుణ్ అనే పాత్రలో కనిపించే ఓ కుర్రాడు తన కామెడీతో విపరీతంగా నవ్విస్తాడు. ఈ సినిమా కంటే ముందు ‘ద బేకర్ అండ్ ద బ్యూటీ’ అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు. అయితే ఇప్పుడు హీరోగా మారిపోయాడు. లేటేస్టుగా వస్తున్న ‘మ్యాడ్’ అనే చిత్రంతో హీరోగా మారిపోయాడు. అయితే ఈ కుర్రాడు ఎవరో కాదు. ఓ స్టార్ డైరెక్టర్ కొడుకు. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. శోభన్..
ప్రభాస్ నటించిన వర్షం మూవీ డైరెక్టరే శోభన్. ఈ సినిమా తరువా కొన్ని సినిమాలను తీసిన శోభన్ ఆ తరువాత తగ్గించేశాడు. అయితే తన కుమారుడు సంగీత్ ను వెబ్ సిరీస్ ద్వారా పరిచయం చేశాడు. ఆ తరువాత ‘గోల్కోండ హైస్కూల్’ చిత్రంలో ఫుల్ టైం నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు తండ్రి బాటలోనే స్టార్ హీరో కావాలని కలలుగంటున్నాడు. చిన్నప్పుడు కడుపుబ్బా నవించిన సంగీత్ శోభన్.. మ్యాడ్ చిత్రంలోనూ అలరించాడు.