https://oktelugu.com/

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ తీసిన సినిమాల్లో మహేష్ బాబు కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా మన ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులు చూపించినంత క్రియేటివిటి ని మిగతా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు చూపించకపోవడం విశేషం...అందువల్లే మన సినిమాలు సూపర్ సక్సెస్ అవుతుంటే మిగతా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు డిజాస్టర్లను ముట్టగట్టుకుంటున్నాయి...

Written By: , Updated On : October 21, 2024 / 02:25 PM IST
Sandeep Reddy Vanga -Maheshbabu

Sandeep Reddy Vanga -Maheshbabu

Follow us on

Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న హీరో మహేష్ బాబు… ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీదనే చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దాని మీద సరైన డేట్ అయితే రావడం లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాని తొందరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగా తనదైన రీతిలో సినిమాలు చేసి భారీ సక్సెస్ లుగా నిలిపే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక తను చేస్తున్న ప్రతి ప్రయోగం కూడా సక్సెస్ ఫుల్ గా నిలవడమే కాకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఆయన ఒక సినిమా చేయాల్సింది కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఆయనకి బాగా నచ్చిన సినిమా ఏంటి అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.

సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో మహేష్ బాబుకి అర్జున్ రెడ్డి సినిమా అంటే చాలా ఇష్టమట. ఆ సినిమాలో ఒక లవ్ స్టోరీ ని చూపించడమే కాకుండా సందీప్ తన మార్కుతో సినిమాని బ్లాక్ బాస్టర్ గా నిలిపాడు అంటూ మహేష్ బాబు చాలా సందర్భాల్లో ఈ సినిమా గురించి మాట్లాడాడు. ఇక అనిమల్ సినిమా కూడా తనకు చాలా ఇష్టమని చెప్పినప్పటికీ అనిమల్ తో పోల్చుకుంటే అర్జున్ రెడ్డి సినిమా మాత్రం చాలా బాగా నచ్చిందని ఆ సినిమాను చూసే సందీప్ తో సినిమా చేయాలని అనుకున్నాను.

కానీ అది కార్య రూపం దాల్చలేదంటూ మహేష్ బాబు ఇంతకు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు రాజమౌళితో చేయబోయే సినిమా తొందరగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యం తో ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ సినిమా మీద భారీ కసరత్తులను చేస్తున్నట్టు తెలుస్తుంది…