Ram Charan Daughter: హీరో రామ్ చరణ్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి ఉపాసన నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రామ్ చరణ్ కి కూతురు పుట్టడంతో కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవి మీడియా వేదికగా తన ఆనందం తెలియజేశారు. తమ ఇష్టదైవం ఆంజనేయ స్వామి మంగళవారం రోజు బిడ్డను ప్రసాదించాడని అన్నారు. రామ్ చరణ్ తండ్రి కావాలనేది ఎన్నో ఏళ్ల నిరీక్షణ. అందుకే ఆనందం వెల్లివిరిసింది. బంధువులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పాప శుభఘడియల్లో పుట్టింది అంటున్నారు. ఈ మధ్య కాలంలో మా కుటుంబంలో జరిగిన శుభాలకు ఈ పాపనే కారణం… అంటూ చెప్పుకొచ్చారు.
కాగా ఉపాసన-రామ్ చరణ్ బిడ్డ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి జాతకం విశ్లేషించాడు. ఈ మేరకు కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. ఉపాసన కూతురు రాత్రి 1:49 నిమిషాలకు జన్మించింది. అంటే పునర్వసు నక్షత్రం, రెండవ పాదం మిధునరాశిలో జన్మించింది. కాబట్టి జన్మనం కోణంగి అని చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ రాశి రోహిణి, ఉపాసన రాశి కృతిక. పాపది పునర్వసు నక్షత్రం. ముగ్గురు దేవత అంశం కలిగి ఉన్నారు.
రామ్ చరణ్ కూతురికి రాజయోగం కనిపిస్తుంది. ఆమె కుటుంబంలో మరిన్ని సంతోషాలు, శుభాలు తీసుకు వస్తుంది. చిరంజీవి జాతకంతో సమానంగా ఉంది. ఆమె భవిష్యత్ లో చరిత్ర సృష్టిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తుంది. కీర్తిలో రామ్ చరణ్, ఉపాసనలను కూడా దాటేస్తుంది. అయితే జాతకంలో చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి. ఆమెకు నరాలు, పంటి, చెవికి సంబంధించిన సమస్యలు రావొచ్చు.
అలాగే ఉపాసన ఇకపై పిల్లల్ని కనకపోవచ్చు. రామ్ చరణ్ దంపతుల జాతకం ప్రకారం మరో బిడ్డను పొందే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. వేణు స్వామి మాటలు కొంత సంతోషం, కొంత బాధించేవిగా ఉన్నాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి ఉంది. అబ్బాయిని కంటే వారసత్వాన్ని నిలిపేవాడు అవుతాడని భావించారు. అమ్మాయి పుట్టడంతో కొంచెం ఉసూరుమన్నారు. అయితే రెండో సంతానం అబ్బాయి పుడతాడన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.