https://oktelugu.com/

Hero Ali – Anchor Suma : ఆ విషయంలో పోటీపడుతున్న అలీ, సుమ.. ఇదేమి దారుణం

ఒక రకంగా చూసుకుంటే ఈటీవీ లో టాప్ యాంకర్స్ గా ఉన్న అలీ, సుమ ఇప్పుడు చెత్త రేటింగ్స్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇప్పటికైనా ఈటీవీ మేల్కొని సరికొత్త ఆలోచనలతో ముందుకు రాకపోతే ఇప్పుడున్న మూడో స్థానం కూడా నిలపడం కష్టమే సుమీ..! 

Written By:
  • Shiva
  • , Updated On : July 23, 2023 / 04:36 PM IST
    Follow us on

    Hero Ali – Anchor Suma : టెలివిజన్ రంగంలో తీవ్రమైన పోటీ ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడటం కత్తి మీద సామే అని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేయకపోతే వెనక పడి పోవడం ఖాయం. ఒక్కప్పుడు ఈటీవీ అంటే ఎంటర్టైన్మెంట్ కి అడ్డా అనే చెప్పాలి, జబర్దస్త్, ఢీ, ఆలీతో సరదాగా , క్యాష్, పాడుతా తీయగా లాంటి ప్రోగ్రామ్స్ తో తెలుగు టెలివిజన్ రంగాన్ని ఒక ఊపు ఊపింది. ఇతర పోటీ చానెల్స్ స్టార్ మా , జీ తెలుగు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసిన కానీ ఈటీవీ తర్వాతి స్థానంలో ఆగిపోయాయి.

    కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మొదటి స్థానంలో ఉన్న ఈటీవీ క్రమేపి మూడో స్థానానికి పడిపోవటం విశేషం. నిజం చెప్పాలంటే ఒక్క ఈటీవీ మాత్రమే కాదు దానికి అనుబంధ ఛానల్స్ అయిన ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్ అలాగే ఈటీవీ యొక్క న్యూస్ చానెల్స్ కూడా దారుణంగా పడిపోయాయి. కనీసం వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఈటీవీ టాప్ లో ఉన్నప్పుడు ఇవేమి పెద్ద సమస్య అనిపించలేదు కానీ, ఇప్పుడు ఈటీవీ కూడా మూడో స్థానానికి పడిపోవటంతో అసలు సమస్య మొదలైంది.

    ఈటీవీ ఇప్పటికి కూడా పాత ఆలోచనలతో ముందుకు వెళ్తుంది. ఎస్పీ బాలు స్థానంలో ఎస్పీ చరణ్ ని పెట్టిన కానీ పాడుతా తీయగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అలాగే ఎప్పుడో దశాబ్దం కింద మొదలుపెట్టిన జబర్దస్త్ షో ఇప్పటి తరాన్ని ఆకట్టుకోవడం లేదనేది వాస్తవం. ఒకప్పుడు ఈటీవీకి మల్లెమాల సంస్థ కు కామధేనువు లాంటి జబర్దస్త్ ఇప్పుడు అతుకుల బొంత గా మారిపోయింది. ఇక సుడిగాలి సుధీర్, రష్మీ లాంటి వాళ్ళు ఢీ నుండి వెళ్లిపోవడంతో హైపర్ ఆది ఎంత ట్రై చేసిన కనీస స్థాయిలో కూడా ఎంగేజ్ చేయలేకపోతున్నాడు.

    ఇక సుమ సరికొత్త షో సుమ అడ్డా ను మెగాస్టార్ చిరంజీవి తో మొదలుపెట్టినా, అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. తనకు అలవాటైన రొటీన్ మాటలతో ఆడియన్స్ ను టార్చర్ చేయటం తప్ప కొత్తగా ఏమి కనిపించడం లేదు. ఈ షో కి కేవలం 2. 3 బార్ రేటింగ్ మాత్రమే వస్తుంది.  ఇక ఆలీతో సరదాగా షో గురించి చెప్పాలంటే పెద్ద ప్రసవం లాగే ఉంటుంది. ఒకప్పుడు మంచి రేటింగ్స్ దూసుకెళ్లిన ఈ షో క్రమేపి సరైన గెస్ట్ లు లేకపోవటంతో వెనకబడిపోయింది. ఇదే సమయంలో ఆలీకి ఏపీ ప్రభుత్వం ఒక పదవి ఇవ్వటంతో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఈ లోపు వెన్నెల కిషోర్ తో ఎదో షో స్టార్ట్ చేపించిన కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోగా, దారుణమైన రేటింగ్స్ రావటంతో దానిని మధ్యలోనే ఆపేశారు.

    అదే సమయంలో అలీ తనకు వచ్చిన పదవిలో పని చేయడానికి పెద్దగా ఏమీ లేదని సత్యం గ్రహించి అలీతో ఆల్ ఇన్ వన్ షో కు శ్రీకారం చుట్టాడు. కొన్ని మార్పులు చేర్పులతో ఇతర ప్రోగ్రామ్స్ నుండి కొన్ని స్కిట్స్ కాపీ కొట్టి ఈ ప్రోగ్రాం ను ఫైనల్ చేస్తే దానికి వచ్చింది రేటింగ్ 1. 94. నాసిరకం సీరియల్స్ కూడా అంతకంటే ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే ఈటీవీ లో టాప్ యాంకర్స్ గా ఉన్న అలీ, సుమ ఇప్పుడు చెత్త రేటింగ్స్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇప్పటికైనా ఈటీవీ మేల్కొని సరికొత్త ఆలోచనలతో ముందుకు రాకపోతే ఇప్పుడున్న మూడో స్థానం కూడా నిలపడం కష్టమే సుమీ..!