Dimple Hayati : హైదరాబాద్ భామ డింపుల్ హయాతి పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. చక్కని రూపం ఉన్నా సక్సెస్ దక్కకపోవడంతో వెనుకబడిపోయింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన డింపుల్ హయాతి గల్ఫ్ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ప్రభుదేవా-తమన్నా జంటగా నటించిన అభినేత్రి 2లో కీలక రోల్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ మూవీలో స్పెషల్ సాంగ్ ఆఫర్ చేశాడు. ‘సూపర్ హిట్టు’ సాంగ్ లో డింపుల్ హయాతి ఆకట్టుకుంది.