Mokshajna- Bellamkonda Ganesh: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లం కొండా సాయి శ్రీనివాస్ ఇది వరకే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా నటించి , తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నారు.ఇప్పుడు ఆయన తమ్ముడు కూడా రీసెంట్ గానే ‘స్వాతి ముత్యం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.
అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం కూడా ఈ చిత్రం విడుదలైన రోజే అవ్వడం వల్ల కలెక్షన్స్ కి భారీ గా చిల్లు పడిందని అంటున్నారు.ఈ చిత్రం తర్వాత ఆయన చేస్తున్న రెండవ చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. అతి త్వరలోనే విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు బెల్లంకొండ గణేష్.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాదానాలు చెప్పాడు బెల్లంకొండ గణేష్. మీ మొదటి సినిమా ‘స్వాతి ముత్యం’ చిత్రం ప్రీమియర్ షో కి నందమూరి బాలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞ తేజ కూడా వచ్చాడు కదా, మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నట్టు ఉంది అని అడుగుతాడు.
అప్పుడు గణేష్ సమాధానం ఇస్తూ ‘అవును అండీ..మేమిద్దరం చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్, అమెరికా లో మేమిద్దరం ఒకే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదువుకునే వాళ్ళం. ఒకే అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళం, ఇద్దరం కలిసి కార్ లో బాగా తిరిగేవాళ్ళం. ఇద్దరం కూడా ఒకేసారి కెరీర్ ని ప్రారంభిద్దాం అనుకున్నాం కానీ, నేను ముందుగా ఇండస్ట్రీ కి వచ్చేసాను. ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికా లో ఇంకా ఫిలిం కోర్స్ చేస్తున్నాడు, అతని లాంచింగ్ త్వరలోనే ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ గణేష్.