Raja Saab Movie Talk: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్…పాన్ ఇండియాలో ఆయనకి మంచిన్క్రేజ్ ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా యావత్ ప్రేక్షకులందరిని మెప్పిస్తుండటం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో ఆయన చేసిన రాజసాబ్ సినిమా సైతం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది…ఇక మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు తెరకెక్కించిన ఈ సినిమా విషయంలో మారుతి చాలా వరకు గాడి తప్పడు.
ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికి ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో ఆయన సక్సెస్ కాలేకపోయాడు… ప్రభాస్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నానమ్మతో తాతయ్యను తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పిన బయలుదేరుతాడు. ఇక్కడే ఫస్టాఫ్ మొత్తాన్ని బోరింగ్ లేకుండా సాగించి ఉంటే బాగుండేది.
స్క్రీన్ ప్లే ని ఇంకొంచెం డిఫరెంట్ గా రాసి ఉంటే రాజా సాబ్ సినిమాకి కొంచెం బూస్టప్ వచ్చి ఉండేది. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి సైతం సినిమాను చాలా ఇంట్రెస్టింగ్ గా చూడ్డానికి ఆస్కారం ఏర్పడేది. కానీ ఫస్టాఫ్ లోనే మారుతి అడ్డదిడ్డమైన కామెడీ ఎపిసోడ్లను పెట్టి సినిమా ఫ్లో ను చెడగొట్టాడు. అదే ఫ్లోలో సినిమా ముందుకి వెళ్తుంటే ఫస్టాఫ్ ఎంగేజింగ్ గా ఉండేది.
ఇప్పుడున్న సెకండాఫ్ తో ప్రేక్షకుడు కొంతవరకు సాటిస్ఫై అయ్యేవాడు. కానీ ఫస్టాఫ్ లోనే ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఈ సినిమాని చూస్తున్నంత సేపు ఏదో జరుగుతుంది తప్ప అందులో హై ఎలిమెంట్స్ అయితే కనిపించలేదు దానివల్లే డివైడ్ టాక్ వచ్చింది… ఇక ఓల్డ్ ఫార్మాట్లోనే స్క్రీన్ ప్లే ను రాసుకోవడం కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అయింది… చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది అనేది…