Trivikram Srinivas: తెలుగు సినిమాలకి కథ మాటలు అందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్…ఈయన మొదట రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ లు అందుకొని ఆ తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గా తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈయన చేస్తున్న సినిమాలు చాలా కామెడీ గా ఉంటూనే యాక్షన్ సెంటిమెంట్ ని కూడా కలగలుపుకొని ఉంటాయి.
అయితే ఈయన తీసే ప్రతి సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.ఈ ఇద్దరు హీరోయిన్లను త్రివిక్రమ్ ఎందుకు పెట్టుకుంటాడు అనే విషయం మీద చాలామందికి చాలా డౌట్లయితే ఉన్నాయి. జల్సా సినిమా నుంచి ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం సినిమా దాకా ప్రతి సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఇద్దరు హీరోయిన్లను పెట్టి సినిమాలు చేశాడు. అయితే పెట్టీ సినిమాలు చేయడం వెనక కారణం ఏంటి అంటే ఒక హీరోని ఒక హీరోయిన్ తో జనాలు కొద్దిసేపు మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు దాంతో ఇంకొక హీరోయిన్ ని కూడా కొద్దిసేపు హీరోతో ఆదిపడినట్టు గా చూపిస్తే జనాలకి ఇంకా ఆసక్తి పెరుగుతుంది. అంటే ఒకే టికెట్ మీద రెండు షోలు చూసినట్టవుతుందనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ ఈ ఇద్దరు హీరోయిన్ల జిమ్మిక్కును ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే సెకండ్ హీరోయిన్ కి సినిమాలో పెద్దగా ఇన్వాల్వ్ మెంట్ ఉండనప్పటికీ జనాలను ఎంటర్ టైన్ చేయడం కోసం ఆయన ఇద్దరు హీరోయిన్ లను తీసుకుంటూ ఉంటాడు… ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు హీరో పక్కన ఆడి పాడి సినిమా సక్సెస్ లో వాళ్లు కూడా తమ వంతు పాత్రను పోషిస్తూ వస్తుంటారు.
ఇక గుంటూరు కారం సినిమాలో కూడా శ్రీ లీలా, మీనాక్షి చౌదరి లాంటి ఇద్దరు హీరోయిన్లను పెట్టుకుని ఈ సినిమాని తీశారు.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చాలా రోజుల నుంచి అందరిలో ఉన్న ఒకే ఒక ప్రశ్న గురూజీ తన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను ఎందుకు పెట్టుకుంటాడు అనేది ఇక ఇప్పుడు దానికి ఒక క్లారిటీ దొరికిందనే చెప్పాలి. ఇక ఈరోజు గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గుంటూరులో ప్లాన్ చేసినట్టు గా చిత్ర యూనిట్ తెలియజేసింది…