Baldness: వాతావరణం కాలుష్యం, నాణ్యమైన ఆహారం లేకపోవడంతో నేటి కాలంలో చాలా మంది అనారోగ్యం బారినపడుతున్నారు. విటమిన్లు, జన్యులోపం కారణంగా అనేక కొత్త సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా పురుషుల్లో బట్టతల రావడం నిరాశను కలిగిస్తుంది. ఇది వయసు పడ్డవారికి అయితే పర్వాలేదు. కానీ యవ్వనంలోనే బట్టతల రావడం ఆందోళన కలిగిస్తోంది. బట్టతల నివారణకు ఎన్నో మెడిసిన్లు వాడినా ఫలితం ఉండడం లేదు. ఈమధ్య హెయిర్ ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ చేయించుకున్నా.. అది తాత్కాలికమే అన్న వాదన వినిపిస్తోంది అయితే బట్టతల ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ కొందరు ఆరోగ్య నిపుణులు అసలైన కారణాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
పురుషులకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో బట్టతల ఒకటి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు రాలిపోతుంది. కానీ మళ్లీ పెరగదు. కానీ కొందరికి థైరాయిడ్ గ్రంథి సమస్య ఉన్న వారికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. ప్రధానంగా ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొనే వారిలో బట్టతల సమస్య ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన మానసిక ఆందోళన కారణంగానూ ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇక మద్యపానం, ధూమపానం చేసేవారిలో బట్టతల వస్తుందని తేలడందో ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. నిత్యం టెన్షన్ వాతావరణంతో ఉన్నవారు ఈ వ్యసనాల బారినపడుతున్నారు. దీంతో సరైనా ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఈ క్రమంలో శరీరంలో అవసరమైన ప్రోటీన్లు కరువై హెయిర్ గ్రోత్ కావడానికి ఆటంకాలు ఏర్పడుతాయి. దీంతో బట్టతల వస్తుందని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ వ్యసనాలకు దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు.
బట్టతల రావడానికి వారసత్వం తదితర కారణాలు చెబుతున్నా.. ఆరోగ్య అలవాట్లలో జాగ్రత్తలు పాటించకపోవడమూ కారణమని తెలుపుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉంటూ ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటిస్తే ఈ నష్ట నివారణకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.