Dog Dubbing: కుక్క ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పడం ఎప్పుడైనా చూసారా..ప్రపంచంలో ఇదే తొలిసారి!

భవిష్యత్తులో మన ఇండియన్ సినిమా హాలీవుడ్ ని దాటేస్తుంది అనడానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ జరగని అద్భుతం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రఘు హాసన్ అనే కన్నడ దర్శకుడు లేటెస్ట్ గా 'నాను మత్తు గూండా - 2 ' అనే చిత్రం తెరకెక్కించాడు.

Written By: Vicky, Updated On : August 12, 2024 10:13 am

Dog Dubbing

Follow us on

Dog Dubbing: మన ఇండియన్ సినిమా ప్రస్తుతం హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో హాలీవుడ్ ని మించిన రేంజ్ కి ఎదుగుతాము అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన దగ్గర ఆ రేంజ్ టెక్నీషియన్స్ ఉన్నారు. రాజమౌళి, శంకర్ లాంటోళ్ళు పది సంవత్సరాలకు ఒకరు వస్తారు అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అలాంటి దర్శకులు ఏడాదికి ఒకరు వచ్చేస్తున్నారు. విజువల్ వండర్స్ కేవలం రాజమౌళి మాత్రమే తియ్యగలడు అని నిన్న మొన్నటి వరకు అనుకున్న మాట. కానీ ఇప్పుడు కల్కి సినిమా తో నేను కూడా ఉన్నాను అంటూ నిరూపించి సత్తా చాటాడు యంగ్ దర్శకుడు నాగ అశ్విన్. అలాగే సందీప్ వంగ, ప్రశాంత్ నీల్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పాటు, అట్లీ లాంటి పాన్ ఇండియన్ కమర్షియల్ డైరెక్టర్స్ కూడా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరి తమ సత్తా చాటారు.

ఇదంతా భవిష్యత్తులో మన ఇండియన్ సినిమా హాలీవుడ్ ని దాటేస్తుంది అనడానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ జరగని అద్భుతం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రఘు హాసన్ అనే కన్నడ దర్శకుడు లేటెస్ట్ గా ‘నాను మత్తు గూండా – 2 ‘ అనే చిత్రం తెరకెక్కించాడు. ఈ చిత్రం లో శివరాజ్ అనే కన్నడ నటుడు హీరో గా నటిస్తుండగా, సంయుక్త హోరంద్ అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో ‘సింబా’ అనే కుక్క పాత్ర అత్యంత కీలకం. ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో ఈ కుక్కనే హీరో అని చెప్పొచ్చు. ఈ చిత్రం కోసం లాబ్రతర్ జాతికి చెందిన కుక్కని తీసుకొచ్చారు. ఈ పాత్రకు ఆ కుక్క చేత స్వయంగా డబ్బింగ్ చెప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ప్రపంచం లో ఎన్నో సినిమాల్లో కుక్కలను నటింపచేసారు కానీ, ఎక్కడా కూడా కుక్క చేత డబ్బింగ్ చెప్పించలేదు.

అలా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక కుక్క చేత డబ్బింగ్ చెప్పించిన ఘనత మన ఇండియన్ సినిమాకి, అది కూడా మన సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన కన్నడ చిత్ర పరిశ్రమకి దక్కుతుంది. ఈ మూవీ టీం వారు ప్రయత్నం చేస్తే కచ్చితంగా ఈ ఘటన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. మరి మూవీ టీం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందో లేదో చూడాలి. కొన్ని జాతులకు సంబంధించిన కుక్కలకు సరైన ట్రైనింగ్ ఇస్తూ పెంచితే మన మనుషుల లాగానే ప్రవర్తిస్తాయి. ఈ సినిమాలో వాడిన కుక్క కూడా అలాంటి జాతికి చెందినదే. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్ర దర్శకుడు ఇప్పటి వరకు కేవలం ఒక్కే ఒక్క సినిమా చేసాడు. అతను చేసిన ఈ వింత ప్రయత్నం సక్సెస్ అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి మరో ఆణిముత్యం దొరికినట్టే.