Anasuya : అనసూయ భరద్వాజ్ చాలా ఓపెన్ మైండెడ్. అలాగే ఆమె ఇండిపెండెంట్ గా ఉంటారు. ఒకరి కోసం బతకడం సరికాదని ఆమె అంటారు. అనసూయ తీరుపై అనేక మార్లు విమర్శలు వచ్చాయి. కానీ ఆమె ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తుంది. జబర్దస్త్ షోలో అనసూయ ధరించే బట్టలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఎందరు ఎద్దేవా చేసిన అనసూయ వెనక్కి తగ్గలేదు. నా బట్టలు నా ఇష్టం. జడ్జి చేయడానికి మీరెవరు? నాకు కంఫర్ట్ గా ఉంటే ఎలాంటి దుస్తులు అయినా ధరిస్తానని పలుమార్లు స్పష్టత ఇచ్చింది.
అనసూయను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు. ట్రోల్ చేసేవారికి తనదైన కౌంటర్లు ఇస్తుంది. హద్దులు దాటి కామెంట్స్ చేస్తే… సైబర్ కేసులు పెడుతుంది. అనసూయ ఇద్దరు ముగ్గురిని జైలుకి కూడా పంపింది. తనను ట్రోల్ చేసేవారు మరింత కుళ్ళుకునేలా అనసూయ పోస్ట్స్ పెడుతుంది. కాగా అనసూయ తన ప్రైవేట్ మేటర్ సైతం పబ్లిక్ లో చెప్పి షాక్ ఇచ్చింది.
అనసూయకు మరో బిడ్డను కనాలని ఉందట. కానీ వాళ్ళ భర్త శశాంక్ సహకరించడం లేదట. అనసూయకు ఆల్రెడీ ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆడపిల్ల కావాలని అనసూయ కోరుకుంటుంది. మా ఇంట్లో నేను తప్ప మిగతా ముగ్గురు మగ వాళ్లే. మీసాలు, గడ్డాలతో ఉంటారు. అదే ఒక్క అమ్మాయి ఇంట్లో ఉంటే ఈ ముగ్గురు మగవాళ్ళు కంట్రోల్ లో ఉంటారు. అప్పుడు ఇల్లు బ్యాలన్స్డ్ గా ఉంటుంది. అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ కళే వేరు అని అనసూయ అన్నారు.
అయితే తన భర్త సుశాంక్ మాత్రం తనకు సహకరించడం లేదట. ఆడ పిల్లలను కాణాలన్న తన కోరిక తీర్చడం లేదట. నీకేమి చక్కగా బిడ్డను కని, నీ జాబ్ నువ్వు చూసుకుంటావ్. ఆ తర్వాత ఆ బిడ్డ బాధ్యత నేను చూసుకోవాలి. అందుకే ఇంకా పిల్లలు వద్దు అంటున్నాడట. 40 ఏళ్ల అనసూయకు ఇంకా పిల్లలు కనాలనే కోరిక నిజంగా విడ్డూరం. ఆమె భిన్నమైన మనస్తత్వానికి నిదర్శనం. కాగా సుశాంక్ ని అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. అనసూయ జబర్దస్త్ కి రాకముందే సుశాంక్ తో ఏడడుగులు వేసింది.
ప్రస్తుతం ఆమె నటిగా బిజీగా ఉన్నారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2లో దాక్షాయణిగా మరోసారి నెగిటివ్ రోల్ లో అలరించింది. కొన్నాళ్లుగా ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో ఒక గేమ్ షో చేసింది. ఈ షోకి శేఖర్ మాస్టర్ తో పాటు ఆమె జడ్జిగా వ్యవహరించారు. ఈ షోలో మరోసారి తన బోల్డ్నెస్ బయటకు తీసి వార్తలకు ఎక్కింది.