https://oktelugu.com/

Director Trivikram: నాట్య ప్రదర్శనకు రెడీ అయిన త్రివిక్రమ్ భార్య… సౌజన్య శ్రీనివాస్

Director Trivikram: ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. తెలుగు సినిమా ప్రేక్షకులను తన సినిమాలతో అలరించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు త్రివిక్రమ్. ఆయన ఫ్యామిలీ గురించి, పర్సనల్ విషయాల గురించి త్రివిక్రమ్ తక్కువ మాట్లాడతారు. ఆయన భార్య ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రికి స్వయానా సోదరుని కుమార్తె… ఆవిడ పేరు సౌజన్య. క్లాసికల్ డాన్సర్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. గతంలో ఆమె కొన్ని నృత్య ప్రదర్శనలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 05:48 PM IST
    Follow us on

    Director Trivikram: ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. తెలుగు సినిమా ప్రేక్షకులను తన సినిమాలతో అలరించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు త్రివిక్రమ్. ఆయన ఫ్యామిలీ గురించి, పర్సనల్ విషయాల గురించి త్రివిక్రమ్ తక్కువ మాట్లాడతారు. ఆయన భార్య ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రికి స్వయానా సోదరుని కుమార్తె… ఆవిడ పేరు సౌజన్య. క్లాసికల్ డాన్సర్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. గతంలో ఆమె కొన్ని నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

    ఇప్పుడు తాజాగా సౌజన్య మరో నృత్య ప్రదర్శనకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వంలో ‘మీనాక్షీ కల్యాణం’ నృత్యరూపక ప్రదర్శన ఇవ్వడానికి సౌజన్య సిద్దమయినట్లు కనబడుతున్నారు. ఈ నెల 17న శిల్పకళా వేదికలో ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రదర్శన మొదలు కానుంది. గతంలోనూ ఇటువంటి ప్రదర్శనలు సౌజన్యా శ్రీనివాస్ ఇచ్చారు. త్రివిక్రమ్ భార్యగా కాకుండా నృత్య కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఆమె సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు వస్తే… పవన్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’కు స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. గత ఏడాది సంక్రాంతికి ఆయన దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ భారీ విజయం అందుకున్నారు. త్వరలోనే మహేష్ బాబుతో మూవీ తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.