https://oktelugu.com/

Rathika Rose: రతిక రోజ్ లవ్ స్టేటస్ ఇదే… క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ

అలాగే రాహుల్ సిప్లిగంజ్ తన ఎక్స్ లవర్ అని పరోక్షంగా హింట్ ఇచ్చింది. ఆమె పీ ఆర్ టీమ్ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ చేశారు. రతిక రోజ్ తీరుపై రాహుల్ సిప్లిగంజ్ మండిపడ్డాడు. మొత్తంగా రతిక రోజ్ బిహేవియర్ నచ్చని ప్రేక్షకులు ఆమెను ఇంటికి పంపేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 13, 2024 / 12:53 PM IST
    Follow us on

    Rathika Rose: బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అనేక విషయాలు పంచుకుంది. అదే సమయంలో తన లవ్ మేటర్ పై స్పందించింది. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న రతిక రోజ్ అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని ఆమె టార్గెట్ చేయడం ఆడియన్స్ కి నచ్చలేదు. మొదటివారంలో పల్లవి ప్రశాంత్ కి రతిక రోజ్ సన్నిహితంగా వ్యవహరించింది. అతనిలో తనపై ఆశలు పెంచేలా ప్రవర్తించింది. రెండో వారం నామినేషన్స్ లో నువ్వేం పీకావ్ అంటూ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది.

    అలాగే రాహుల్ సిప్లిగంజ్ తన ఎక్స్ లవర్ అని పరోక్షంగా హింట్ ఇచ్చింది. ఆమె పీ ఆర్ టీమ్ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ చేశారు. రతిక రోజ్ తీరుపై రాహుల్ సిప్లిగంజ్ మండిపడ్డాడు. మొత్తంగా రతిక రోజ్ బిహేవియర్ నచ్చని ప్రేక్షకులు ఆమెను ఇంటికి పంపేశారు. నాలుగో వారమే రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది.

    అయితే బిగ్ బాస్ ఆమెకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని వారాలు బయట ఉన్న రతిక రోజ్ రీఎంట్రీ ఇచ్చింది. పల్లవి ప్రశాంత్ కారణంగానే నెగిటివ్ అయ్యానని తెలుసుకున్న రతిక రోజ్ అతనితో స్నేహం చేయాలి అనుకుంది. ఈసారి రైతుబిడ్డ తెలివిగా మెలిగాడు. అక్క అని పిలుస్తూ రతిక రోజ్ కి చిరాకు తెప్పించాడు. ఇటీవల బీబీ ఉత్సవం షోలో వీరిద్దరూ కలిసి ఓ సాంగ్ కి డాన్స్ చేశారు. పల్లవి ప్రశాంత్ కి రతిక రోజ్ క్షమాపణలు చెప్పింది.

    బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలు ఏమైనా మనసులో పెట్టుకుంటే క్షమించు అని బహిరంగంగా చెప్పింది. కాగా రతిక రోజ్ ఇటీవల ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఓ నెటిజెన్ పల్లవి ప్రశాంత్ తో లవ్ ఫ్రాంక్ చేయాలని అడగ్గా… అతడికి అంత మెచ్యూరిటీ లేదు. చాలా సెన్సిటివ్. అలాగే లవ్ విషయంలో నేను ఫ్రాంక్స్ చేయను అని చెప్పింది. మరో నెటిజెన్ మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటని అడగ్గా… సింగిల్ అని సమాధానం చెప్పింది.