Bigg Boss 8 Telugu: అప్పుడప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చే వారు ప్రేక్షకులకు బాగా దగ్గర అవ్వడానికి బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక్కసారి అవకాశం వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉంటూ ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్లకి, మళ్ళీ ఇండస్ట్రీ లోకి తిరిగి రావాలని అనుకుంటే బిగ్ బాస్ రియాలిటీ షోని మించిన మాధ్యమం మరొకటి లేదు. ఎంతోమంది ఈ షో ద్వారా సినీ కెరీర్ ని పొందారు. అలాంటి షో లో అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి..?, కానీ త్వరలో ప్రసారం అవ్వబోయే బిగ్ బాస్ 8 తెలుగు లో పాల్గొనడానికి కొంతమంది కంటెస్టెంట్స్ ససేమీరా నో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళని ప్రతీ సీజన్ ప్రారంభం అయ్యేముందు బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదిస్తూనే ఉంటుంది, కానీ వీళ్ళు రావడం లేదు. అలా ఈ సీజన్ లో బిగ్ బాస్ కి బిగ్ నో చెప్పిన సెలెబ్రిటీల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం.
ముందుగా మనం ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి మాట్లాడుకోవాలి. మూడేళ్ళ క్రితం వరకు రాజ్ తరుణ్ కి టాలీవుడ్ లో మీడియం రేంజ్ మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు వరుస ఫ్లాప్స్ కారణంగా ఆ మార్కెట్ పోయింది. అంతే కాకుండా ఆయన ప్రస్తుతం ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నాడో మనమంతా చూసాము. ఈయనని ఈ షోలోకి ఒక కంటెస్టెంట్ గా తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు. ఇక ఈ సీజన్ లో పాల్గొనడానికి ఇష్టపడని మరో కంటెస్టెంట్ యాంకర్ వర్షిణి. గత రెండు సీజన్స్ లో కూడా ఈమెని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించారు. ఈటీవీ లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమెకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అంతే కాదు ఇంస్టాగ్రామ్ లో ఈమె తరచూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. తనకి సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లను మెంటలెక్కిపోయేలా చేస్తూ ఉంటుంది. అలాంటి ఈమె బిగ్ బాస్ షో లోకి అడుగుపెడితే కచ్చితంగా టీఆర్ఫీ రేటింగ్స్ పెరుగుతాయి. కానీ ఈమెకి తన వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకోవడం ఇష్టం లేదని, అందుకే రావడం లేదంటూ చెప్పుకొచ్చింది.
అలాగే ఒకప్పుడు యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో అబ్బాస్ ని కూడా ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసారు. కానీ రెమ్యూనరేషన్ విషయం లో బిగ్ బాస్ యాజమాన్యం కి అబ్బాస్ కి సెట్ కాకపోవడంతో ఆయన ఈ షోలో పాల్గొనేందుకు ఒప్పుకోలేదు. చమ్మక్ చంద్ర, యాంకర్ ఉదయ భాను, సీరియల్ నటి శిరీష, ఇంద్రనీల్, యువసామ్రాట్ వంటి వారు కూడా ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.