Pavan Daughter : ఇటీవల పవన్ కుటుంబం బయట వేదికల వద్ద కనిపిస్తోంది. ఏపీలో కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లారు.ఆ సమయంలో భార్యతో పాటు ఇద్దరు పిల్లలను పరిచయం చేశారు. ప్రమాణ స్వీకారం రోజు హాజరైన ప్రధాని మోడీకి తన ఇద్దరు పిల్లలను పరిచయం చేశారు పవన్. ప్రస్తుతం తండ్రి పవన్ వద్దే అకిరా, ఆద్య ఉన్నారు. డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పవన్ సినిమాలు చేయడం లేదు. పాలనాపరమైన అంశాలకు పరిమితం అవుతున్నారు.ఈ నేపథ్యంలో సొంత జిల్లా కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి హోదాలో పాల్గొన్నారు. కుమార్తె ఆద్యను తీసుకువెళ్లారు. తొలిసారిగా మంత్రి హోదాలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా స్వాతంత్ర వేడుకల్లో కుమార్తె ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు.దీంతో ఎవరు ఆ పిల్ల అంటూ అందరూ ఆరా తీయడం కనిపించింది. పవన్ కుమార్తె ఆద్య అని తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. వేదికపై తండ్రి పవన్ తో ఉల్లాసంగా గడిపారు ఆద్య.సెల్ఫీలు కూడా దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జన సైనికులతో పాటు పవన్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.పవన్ కు ఇద్దరు పిల్లలు అంటే చాలా అభిమానం.ఇప్పటికే అకీరా నందన్తండ్రికి అందుబాటులో ఉంటున్నాడు. నిత్యం తండ్రి వెంట కనిపిస్తున్నాడు. ఇప్పుడు కుమార్తె సైతం తండ్రిని అనుసరిస్తుండడం విశేషం.
* ప్రధాని వద్ద గౌరవం
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.ఆ సమయంలో భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అకిరా నందన్ కూడా వెళ్లారు. పవన్ తన కుటుంబాన్ని ప్రధాని మోడీకి పరిచయం చేశారు. మోడీకి అకిరా నమస్కరిస్తుంటే ఆయన ఆప్యాయంగా అతని భుజం తడిమారు.అప్పట్లో ఈ ఫోటోలు జన సైనికులకు ఆకట్టుకున్నాయి. ఆనందం నింపుతాయి. ఈ ఫోటోలతో రేణు దేశాయ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. అకిరా నందన్ తో పాటు ఆద్య రేణు దేశాయ్ పిల్లలు కావడం గమనార్హం.ఇప్పుడు కుమార్తె తండ్రితో తీసుకున్న సెల్ఫీలు చూసి రేణు దేశాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
* సోషల్ మీడియాలో అకిరానందన్
ఇటీవల అకిరా నందన్ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన తండ్రి పవన్ కళ్యాణ్ సినీ జర్నీలోని కొన్ని సీన్లు, పవన్ ఎలివేషన్స్ తో అకిరా తయారుచేసిన వీడియోను రేణు దేశాయ్ ఇనిస్టాలో షేర్ చేశారు. దీనికి మెగా అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. తాను విడిపోయినా పిల్లలు అకిరా నందన్, ఆద్య మాత్రం తండ్రి వద్దే ఉంటున్నారు. అన్నా లెజినోవా వారిని కన్నతల్లి మాదిరిగా చూసుకుంటోంది.
* పిల్లలిద్దరికీ ఆదరణ
మరోవైపు మెగాస్టార్ కుటుంబం నుంచి అకిరా నందన్ సినీ ఎంట్రీ ఉండబోతుందన్నది ఒక వార్త. అందుకు తగ్గట్టుగానే అకిరా నందన్ అన్ని విధాలా కసరత్తు చేస్తున్నాడు. అదే సమయంలో పవన్ రాజకీయ వారసుడు అవుతాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆద్య సైతం తండ్రిని అనుసరిస్తున్నారు. ఇద్దరు పిల్లలు తండ్రి ఆలనలో ఉండగా రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగా ఉంటున్నారు. పిల్లలు ఇద్దరికీ దక్కుతున్న ఆదరణ, గౌరవం చూసి మురిసిపోతున్నారు. ఇప్పుడు ఆద్య సెల్ఫీల పై సైతం ఆమె తప్పకుండా స్పందించే ఛాన్స్ ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More