https://oktelugu.com/

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక అమ్మాయికి ఇంత ఓటింగ్ రావడం ఇదే తొలిసారి..రికార్డ్స్ బద్దలు కొట్టిన ప్రేరణ..టైటిల్ విన్నర్ ఆమేనా?

టాస్కులు ఆడే విధానం లో ఆడపులి గా పేరు తెచ్చుకున్న ప్రేరణ, ఈ వారంతో టైటిల్ విన్నింగ్ రేస్ లోకి రావడం మాత్రమే కాదు, టైటిల్ విన్నర్ స్పాట్ ని కూడా లాక్ చేసేసుకుంది. హౌస్ మేట్స్ అందరూ ఆమెని టార్గెట్ చేయడం, ఆమె వాళ్లకు ధీటుగా సమాదానాలు చెప్పి అవతల వారిని నోరు తెరవనివ్వకుండా లాక్ చేయడం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 23, 2024 / 11:34 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు అందరూ అబ్బాయిలే టైటిల్ విన్నర్స్ గా నిలిచారు కానీ, ఒక్క అమ్మాయి కూడా టైటిల్ విన్నర్ గా నిలబడలేదు. ఓటీటీ సీజన్ లో బిందు మాదవి ఒక్కటే టైటిల్ విన్నర్ గా నిల్చింది. టెలివిజన్ వెర్షన్ లో ఇప్పటి వరకు 7 సీజన్స్ పూర్తి అయితే ఒక్క అమ్మాయి కూడా టైటిల్ విన్నర్ గా నిలబడలేదు. సీజన్ 2 , సీజన్ 3 లో తప్ప మిగిలిన సీజన్స్ లో అమ్మాయిలు కనీసం రన్నర్ గా నిలవలేదు. గత సీజన్ లో అయితే టాప్ 5 లో కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే నిల్చింది. ఇలాంటి పరిస్థితిలో ఒక అమ్మాయి కి రికార్డు స్థాయి ఓటింగ్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ సీజన్ లో ప్రేరణ అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని, రికార్డు స్థాయి ఓటింగ్స్ ని సొంతం చేసుకుంటుంది.

    టాస్కులు ఆడే విధానం లో ఆడపులి గా పేరు తెచ్చుకున్న ప్రేరణ, ఈ వారంతో టైటిల్ విన్నింగ్ రేస్ లోకి రావడం మాత్రమే కాదు, టైటిల్ విన్నర్ స్పాట్ ని కూడా లాక్ చేసేసుకుంది. హౌస్ మేట్స్ అందరూ ఆమెని టార్గెట్ చేయడం, ఆమె వాళ్లకు ధీటుగా సమాదానాలు చెప్పి అవతల వారిని నోరు తెరవనివ్వకుండా లాక్ చేయడం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హౌస్ లో ఎలాంటి మాస్క్ లేకుండా, ఆడుతున్నది కేవలం ప్రేరణ మాత్రమే. తప్పు చేస్తే తప్పు చేశాను అని ఒప్పుకుంటుంది, ఒకవేళ తప్పు చేయకపోతే హోస్ట్ నాగార్జున చెప్పినా వినదు. హౌస్ మేట్స్ మొత్తం ఆ పాయింట్ ని పట్టుకొని నువ్వు నాగార్జున సార్ మాట కూడా వినలేదు అంటే, అవును నా పాయింట్ లో నేను కరెక్ట్ గానే ఉన్నాను అని అంటుంది. ఇలాంటి గట్స్ చూపించిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీ లోనే లేదు అని చెప్పొచ్చు. ఈ లక్షణాలు ఆడియన్స్ కి కూడా నచ్చడం వల్లనే ఆమె నేడు అందరికంటే ఎక్కువ ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది.

    మొదటి నుండి ఈమెకు మంచి ఓటింగ్ పడుతూ ఉండేది కానీ, నిఖిల్, నభీల్ స్థాయిలో మాత్రం ఓటింగ్ పడేది కాదు. చాలా తేడా ఉండేది. కానీ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆమె, నిఖిల్ ని భారీ మార్జిన్ తో క్రాస్ చేసి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఆమెకు యష్మీ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా తోడు అయ్యుండొచ్చు, ఎందుకంటే యష్మీ నామినేషన్స్ లో లేదు కదా అని అందరూ అనుకోవచ్చు. కానీ నభీల్ కూడా నామినేషన్స్ లో లేదు, ఆయన నిఖిల్ తో చాలా క్లోజ్ గా ఉన్నాడు. ఆయన ఓటింగ్ కూడా నిఖిల్ కి పడుతుండొచ్చు కదా అని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రేరణ ఓటింగ్ గ్రాఫ్ చూస్తుంటే, ఇదే విధంగా ఆమె రెండు వారాలు హౌస్ లో గేమ్ ఆడితే, టైటిల్ ఆమెదే అని ఫిక్స్ అయిపోవచ్చు.