Game Changer movie producer : గేమ్ చేంజర్ విషయం లో డిస్సపాయింట్ అవుతున్న ప్రొడ్యూసర్…కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి పేరు గుర్తుకొస్తుంది. నిజానికి ఆయన చేసిన సినిమాలే ఆయనను చాలా ఉన్నతంగా పరిచయం చేస్తుంటాయి. అందువల్లే ఆయన సినిమాల్లో చాలా వరకు వైవిద్యమైతే ఉంటుంది...ఇక ప్రస్తుతం ఇప్పటికి ఆయన సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకుంటున్నాడు...

Written By: Gopi, Updated On : October 23, 2024 11:46 am

Game Changer movie Producer Dill Raju

Follow us on

Game Changer movie producer :  మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మొదటి సినిమాతోనే ఆయన సత్తా ఏంటో చూపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఆయన శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమాకి కథని కార్తీక్ సుబ్బరాజు అందించడం విశేషం. ఇక ఈ కథలో కూడా చాలా వైవిధ్యమైతే ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికైతే శంకర్ ‘భారతీయుడు 2’ సినిమాతో భారీగా డౌన్ అయ్యాడు. మరి ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తేనే ఆయన స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నవాడు అవుతాడు. లేకపోతే మాత్రం ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యంతోనే ఆయన భారీ ప్రణాళికలు చేస్తూ మరి ఈ సినిమాని చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రీసెంట్ గా ఈ సినిమా అవుట్ పుట్ ని ప్రొడ్యూసర్ దిల్ రాజు చూశారట. ఆయన ఈ అవుట్ పుట్ తో అంతగా సాటిస్ఫై అవ్వలేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలీదు గానీ గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇవే వార్తలు వినిపించడం విశేషం…

మరి భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది. 500 కోట్ల వరకు భారీ బడ్జెట్ ను కూడా కేటాయించాడు. ఒకవేళ ఈ సినిమా తేడా కొడితే మాత్రం దిల్ రాజు కి భారీ దెబ్బ పడుతుందనే చెప్పాలి. ఇక దానికోసమే దిల్ రాజు మరింత జాగ్రత్తలు తీసుకొని శంకర్ తో డిస్కషన్ జరిపి ఏవైనా సీన్స్ రీ షూట్ చేయాల్సి ఉంటే మళ్ళీ చేయమని చెబుతున్నట్లుగా కూడా తెలుస్తోంది…

ఇక మొత్తానికైతే శంకర్ కి ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఎంతో ముఖ్యమో దిల్ రాజుకు కూడా అంతే ముఖ్యం… ఎందుకంటే దిల్ రాజు ఈ సినిమా మీద భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నాడు కాబట్టి సినిమా సక్సెస్ ని సాధించి తనకు భారీ లాభాలను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది…