https://oktelugu.com/

Bigg Boss 6 List Of Contestants: బిగ్ బాస్ 6 ఫైనల్ లిస్ట్ ఇదే.. వాళ్ళు కూడా ఉన్నారు.. ఈ సారి హౌస్ లో సంచలనమే

Bigg Boss 6 List Of Contestants: బిగ్ బాస్ సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అవ్వడం, బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా ఆకట్టుకోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ‘సీజన్ 6’ పై పడింది. అయితే, తాజాగా ప్రేక్షకుల నిరీక్షణకు మేకర్స్ ఫుల్‌స్టాప్ పెట్టారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే, బిగ్ బాస్ అభిమానులు సీజన్ 6 […]

Written By:
  • Shiva
  • , Updated On : August 16, 2022 / 11:05 AM IST
    Follow us on

    Bigg Boss 6 List Of Contestants: బిగ్ బాస్ సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అవ్వడం, బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా ఆకట్టుకోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ‘సీజన్ 6’ పై పడింది. అయితే, తాజాగా ప్రేక్షకుల నిరీక్షణకు మేకర్స్ ఫుల్‌స్టాప్ పెట్టారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే, బిగ్ బాస్ అభిమానులు సీజన్ 6 కోసం వెర్రెక్కిపోయి ఉన్నారు. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ మెనేజ్ మెంట్ కూడా ప్రస్తుతం సీజన్ 6 పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.

    Bigg Boss 6

    కంటెస్టెంట్స్ ను కూడా ఎంపిక చేశారు. ఈ సీజన్‌లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. నాగార్జున హోస్ట్ గా ఇప్పటికే బిగ్ బాస్ 6 ప్రోమో రెడీ చేసి వదిలింది. అయితే, ఫైనల్ లిస్ట్ అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కూడా. మరి ఇప్పటికే ఎంపికైన కంటెస్టెంట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే క్వారంటైన్ కి పంపబోతున్నారని తెలుస్తోంది.

    Also  Read: Director Shankar Daughter: ఆ హీరో తో నటిస్తే ఊరుకోను అంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్

    అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన బిగ్ బాస్ గ్రాండ్ సెట్ లో కి సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం పంపే కంటెస్టెంట్స్ ని ఓ వారం పాటు క్వారంటైన్ లో ఉంచిన తర్వాతే హౌస్ లోకి పంపుతారని టాక్ నడుస్తోంది. ఇక ఈ సీజన్ లోకి 17 మంది సభ్యులు హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. మరి వారి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. చూద్దాం వారెవరో అనేది.

    Bigg Boss 6

    1. అజయ్ కుమార్

    2. మిత్రా శర్మ

    3. ఉదయభాను

    4. ఆర్జే చైతూ

    5. అనిల్ రాథోడ్

    6. దీపిక పిల్లి

    7. అమర్ దీప్ చౌదరీ

    8. శ్రీహాన్

    9 నేహా చౌదరీ

    10. ఆర్జే సూర్య

    11. ఆది రెడ్డి

    12. నిఖిల్ విజేంద్ర

    13. చలాకీ చంటీ

    15. శ్రీ సత్య

    16. ఇనయా సుల్తానా

    17. పాండు మాస్టర్

    Also  Read: Nithin: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న హీరో నితిన్

    Tags