Dil Raju: ఇతర ప్రొడ్యూసర్ లకు దిల్ రాజుకు ఉన్న తేడా ఇదేనా?

ప్రతి సినిమాకు దిల్ రాజు జడ్జిమెంట్ ఇస్తుంటారట. ఇలా ఆయన ఇచ్చే జడ్జిమెంట్ వల్ల, ఆ మార్పులు చేర్పులు వల్ల దిల్ రాజు సక్సెస్ లను అందుకుంటున్నారు అని టాక్.

Written By: Swathi, Updated On : February 10, 2024 11:46 am

Dil Raju

Follow us on

Dil Raju: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు దిల్ రాజు. ఈయన తెరకెక్కించిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అవడంతో ఈ రేంజ్ లో పాపులర్ అయ్యారు ఈ ప్రోడ్యూసర్. అంతేకాదు స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సాధించారు కూడా. ఇక ఈయన కెరీర్ మొదట్లో దిల్, ఆర్య, భద్ర లాంటి సినిమాలను తెరకెక్కించడంతో అవి సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిట్ లు ఎక్కువ ఫ్లాప్ లు తక్కువ. దీంతో దిల్ రాజుకు ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉందనే చెప్పాలి.

ఇక ఈయన సక్సెస్ సాధించడానికి మెయిన్ కారణం స్క్రిప్ట్ మీద కమాండ్ ఉండడమే అంటారు కొందరు. ఒక స్టోరీ వినగానే అందులోని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్లను ఈజీగా కనిపిపెట్టి వాటిని చెప్పేస్తారట. ఇలా తప్పు ఒప్పులను తెలుసుకుంటూ.. ప్రేక్షకులకు ఏది ఇవ్వాలో తెలిసిన ప్రొడ్యూసర్ గనుక ఈయన సక్సెస్ మరింత ఈజీ అవుతుంది. అందుకే స్టార్ ప్రొడ్యూసర్ గా ముందుకు సాగుతున్నారు దిల్ రాజు.

ఇక ప్రతి సినిమాకు దిల్ రాజు జడ్జిమెంట్ ఇస్తుంటారట. ఇలా ఆయన ఇచ్చే జడ్జిమెంట్ వల్ల, ఆ మార్పులు చేర్పులు వల్ల దిల్ రాజు సక్సెస్ లను అందుకుంటున్నారు అని టాక్. ఇక మిగితా ప్రొడ్యూసర్లకు తనకు ఉన్న తేడా ఇదొక్కటే అంటారు కొందరు. స్టోరీని విని అందులోని తప్పులను తెలుసుకొని సరిచేయడం వరకు కాస్త కష్టపడతారట ఈ ప్రొడ్యూసర్. ఈ సక్సెస్ ఫార్మూలాతోనే ఆయన సినిమాలు సక్సెస్ అవుతాయి అని టాక్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఇది దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుండడంతో దిల్ రాజు భారీ ఆశలు పెట్టుకున్నారట. ఇక ఈ సినిమాతో ప్రాఫిట్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నారట. ఇక పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారట దిల్ రాజు. మరి ఆయన నమ్మకం నిలుస్తుందో లేదో చూడాలంటే వేచి ఉండాల్సిందే..