Samantha : సౌత్ ఇండియాలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఈమె స్టార్ హీరోయిన్ హోదా ని సంపాదించుకుంది. ఈమె కెరీర్ ని తీసుకుంటే పెళ్ళికి ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య తో పెళ్ళికి ముందు ఈమె కేవలం హీరోల పక్క డ్యాన్స్ వేసే రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ ని మాత్రమే చేస్తూ వచ్చింది. కానీ పెళ్లి తర్వాత మాత్రం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ వచ్చింది. ఇక నాగ చైతన్య తో విడాకులు తర్వాత కూడా అదే తరహా పాత్రలను పోషిస్తుంది. కథ నచ్చితే విలన్ రోల్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న ఈ హాట్ బ్యూటీ రీసెంట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘ నేను తల్చుకుంటే ఎన్నో సాధారణ సినిమాలను అంగీకరించవచ్చు. కానీ ఇప్పుడు నేను ఆ పరిస్థితి లో లేను. నా జీవితం లో రాబోయే ప్రతీ సినిమాని నా చివరి సినిమాగా భావిస్తూ నటిస్తా. కచ్చితంగా నేను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి. అలాంటివి మాత్రమే ఎంచుకుంటా’ అంటూ చెప్పుకొచ్చింది. రాజ్ అండ్ డీకే తో కలిసి పని చేసిన అనుభూతి గురించి ఆమె మాట్లాడుతూ ‘వాళ్ళు ఇద్దరు నాకు ఛాలెంజింగ్ రోల్స్ ని డిజైన్ చేస్తున్నారు. ఫ్యామిలీ సీజన్ 2 లో నన్ను విలన్ గా చూపించారు. ‘సిటాడెల్’ లో నన్ను బీభత్సమైన యాక్షన్ హీరోయిన్ గా చూపించారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి మరో ప్రాజెక్ట్ చేస్తున్నాను. అందులో కూడా నాది ఛాలెంజింగ్ రోల్. వాళ్ళతో కలిసి పనిచేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా ‘మా ఇంటి బంగారం’. కొంతకాలం క్రితమే ఈమె ట్రైలాలా అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించింది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కుతున్న సినిమానే ఇది. కేవలం తన సినిమాలను మాత్రమే కాకుండా, టాలెంట్ ఉన్న కొత్తవాళ్లతో కూడా సినిమాలను నిర్మించబోతోంది. ఇప్పుడు ఆమె రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి చేరడం తో బాలీవుడ్ లో కూడా ఈమెకి అవకాశాలు క్యూలు కడుతున్నాయి. ఇప్పటికే ఆమె ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు బయటకి రానున్నాయి. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వడంతో సమంత కి ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్ నే ఆఫర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే సౌత్ ఇండియా కి సంబంధించి మరికొన్ని సినిమాలను ఆమె ప్రకటించబోతుంది.