https://oktelugu.com/

Pushpa 2 : ది రూల్’ 50 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..సెంటర్స్ కౌంట్ లో కూడా ఆల్ టైం రికార్డ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 : ది రూల్' చిత్రం విడుదలై అప్పుడే 50 రోజులు పూర్తి అయ్యింది. నిన్న గాక మొన్న విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా అప్పుడే ఇంత దూరం వచ్చిందా అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Written By: , Updated On : January 24, 2025 / 05:00 PM IST
Pushpa 2

Pushpa 2

Follow us on

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం విడుదలై అప్పుడే 50 రోజులు పూర్తి అయ్యింది. నిన్న గాక మొన్న విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా అప్పుడే ఇంత దూరం వచ్చిందా అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కొత్తగా సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల వసూళ్లు కూడా తగ్గిపోతున్నాయి. కానీ ‘పుష్ప 2’ వసూళ్ల జోరు మాత్రం ఇంకా తగ్గలేదు. నిన్న కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో నాలుగు లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక సినిమాకి ఇంతటి లాంగ్ రన్ రావడం ఈమధ్య కాలంలో పుష్ప 2 చిత్రానికి మాత్రమే జరిగింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 50 రోజులకు కలిపి 226 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 1862 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. అందులో కేవలం హిందీ వెర్షన్ నుండే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం 50 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 50 రోజుల్లో 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. గ్రాస్ ని చూస్తే 240 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా తమిళనాడు లో 70 కోట్ల రూపాయిలు, కర్ణాటక లో వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. కన్నడ వెర్షన్ లో కూడా ఈ చిత్రం ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది.

కేవలం కన్నడ వెర్షన్ నుండి ఈ చిత్రానికి 50 రోజుల్లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. మన తెలుగు డబ్బింగ్ సినిమాలకు ఈ భాషలో కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడమే గగనం అయిపోతుంది. అలాంటిది ఈ చిత్రానికి ఏకంగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడమంటే ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. కేవలం కలెక్షన్స్ విషయం లోనే కాదు, సెంటర్స్ విషయం లో కూడా ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది. ట్రేడ్ పండితులు చెప్తున్నా లెక్కల ప్రకారం ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఇంకా 700 కి పైగా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తుందని అంటున్నారు. ఓటీటీ ట్రెండ్ లో ఇలాంటి రికార్డ్స్ చూస్తున్నాం అంటే, అదంతా అల్లు అర్జున్ మ్యాజిక్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Pushpa 2 The Rule 50 Days Special Promo | Allu Arjun | Rashmika | Sukumar |  DSP | Fahadh Faasil