అనుష్క నటించిన ‘నిశబ్ధం’ మూవీ మొదట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. ఓవరాల్ గా ఇప్పటిదాకా చూసుకుంటే ఓటీటీలో సైలంట్ గా హిట్టయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ‘నిశబ్ధం’ మూవీని తొలుత థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ‘నిశబ్ధం’ చిత్రాన్ని భారీ రేటుకు కొనుగోలు చేసింది.
ఓటీటీలో రిలీజైన ‘నిశబ్ధం’ మూవీ తొలిరోజు నుంచి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ ప్లాప్ అవుతుందని అందరూ భావించారు. అయితే ‘నిశబ్ధం’ మూవీ లాంగ్ రన్ లో మాత్రం స్ట్రీమింగ్ అవర్స్ పరంగా కొత్త రికార్డును సృష్టించింది. దీంతో ఈ మూవీని కొనుగోలు చేసిన అమేజాన్ ప్రైమ్ కు.. ‘నిశబ్ధం’ నిర్మాతలకు ఉన్న దిగులు పోయింది.
‘నిశబ్ధం’ మూవీ ద్వారా అమెజాన్ ప్రైమ్ భారీగా సబ్‍స్క్రయిబర్లను పెంచుకోవాలని భావించింది. అయితే ఈ మూవీకి బ్యాడ్ టాక్ రావడంతో అమెజాన్ ప్రైమ్ అనుకున్నట్లుగా సబ్‍స్క్రయిబర్లు పెరగలేదని తెలుస్తోంది. ఇదొక్కటే ఓటీటీ నిర్వాహకులు మైనస్ మారింది. అయితే లాంగ్ రన్ లో ఈ మూవీ బ్రేక్ పాయింట్ సాధించడంతో అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు.
అమెజాన్ ప్రైమ్ ‘నిశబ్ధం’ మూవీని కొనుగోలు చేయడం ద్వారా సదరు ఓటీటీ కంటే చిత్ర నిర్మాతలే అధిక లాభం చేకూరింది. ఈ మూవీ థియేటర్లలో రిలీజైతే నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వచ్చేదనే టాక్ విన్పించింది. ఓటీటీ వల్ల ఈ మూవీ ఆడియెన్స్ కు ఎక్కువగా రీచ్ అయిందని.. అదే థియేటర్లలో అయితే ఖచ్చితంగా నిర్మాతలు నష్టపోయేవారనే ప్రచారం జరిగింది.
‘నిశబ్ధం’ మూవీలో అనుష్క నటించడం సినిమా ప్లస్ అయింది. ‘బాహుబలి’ తర్వాత అనుష్కకు వచ్చిన ఈ క్రేజ్ సినిమాను కొంతమేర నిలబెట్టింది. ఇందులో మాధవన్ నటించడంతో తమిళం, హిందీ ప్రేక్షకుల నుంచి వ్యూస్ ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడంతో ఈ మూవీ లాంగ్ రన్ లో ‘సైలంట్’గా హిట్టయినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర నిర్మాతలకు ‘నిశబ్ధం’ ప్లాప్ బెంగ తీరినట్లయింది.