సినీ అభిమానులకు గొప్ప గుడ్ న్యూస్ ఇదీ

కరోనా కల్లోలంలో అన్నీ కొట్టుకుపోయాయి. ప్రాణాలు పోయాయి. కళాశాలలు, పాఠశాలలు మూతబడిపోయాయి. ఉద్యోగ, ఉపాధి దూరమైంది. సినిమాలు ఆగిపోయాయి. థియేటర్లు బంద్ అయిపోయాయి. అయితే సెంకడ్ వేవ్ ముందు మూసుకున్న థియేటర్లు ఇప్పుడు కరోనా తగ్గడంతో తెరుకునే అవకాశం మరోసారి వచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశారు. తాజాగా సినిమా ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ […]

Written By: NARESH, Updated On : July 27, 2021 9:27 am
Follow us on

కరోనా కల్లోలంలో అన్నీ కొట్టుకుపోయాయి. ప్రాణాలు పోయాయి. కళాశాలలు, పాఠశాలలు మూతబడిపోయాయి. ఉద్యోగ, ఉపాధి దూరమైంది. సినిమాలు ఆగిపోయాయి. థియేటర్లు బంద్ అయిపోయాయి. అయితే సెంకడ్ వేవ్ ముందు మూసుకున్న థియేటర్లు ఇప్పుడు కరోనా తగ్గడంతో తెరుకునే అవకాశం మరోసారి వచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశారు. తాజాగా సినిమా ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాసయాదవ్ హామీతో థియేటర్లు ఓపెన్ చేస్తున్నట్టు తెలంగాణ సినిమా థియేటర్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

మంత్రి తలసాని హామీతో ఈనెల 23వ తేదీ నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేసి సినిమాలు రన్ చేయాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో తెలంగాణ అంతటా 100శాతం ఆక్యూపెన్సీ తో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. తాజాగా మంత్రి తలసానిని తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రతినిధులు కలిశారు. సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో వాళ్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 100 శాతం సామర్థ్యంతో తిరిగి థియేటర్లు ప్రారంభించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

ఈ క్రమంలోనే ఈనెల 23 నుంచి సినిమాలు రిలీజ్ చేయించేలా ప్లాన్ చేయాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ నిర్ణయం తీసుకుంది.