అభిమానులకు సారీ చెప్పిన వెంకటేష్.. కారణమిదే

వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ప్రత్యేకత చూపిస్తుంటారు. ప్రేక్షకులను మెప్పించే క్రమంలో ఆయన దారి సపరేటు. ప్రేక్లకులను రక్తికట్టించే పాత్రలు ఎప్పుడు ఎంచుకుంటారు. మూస పాత్రలు కాకుండా నిత్యం వెరైటీని కోరుకుంటారు పాత్రల్లో ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. ఈ నేపథ్యంలో తన సినీ జీవితంలో తాను చేయని పాత్ర అంటూ ఉండకూడదని కోరుకుంటారు ప్రేక్షకులను మెప్పించే క్రమంలో తనదైన శైలి ప్రదర్శిస్తుంటారు. తాజాగా తమిళంలో విజయవంతమైన అసురన్ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా నారప్పగా […]

Written By: Srinivas, Updated On : July 17, 2021 6:48 pm
Follow us on

వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ప్రత్యేకత చూపిస్తుంటారు. ప్రేక్షకులను మెప్పించే క్రమంలో ఆయన దారి సపరేటు. ప్రేక్లకులను రక్తికట్టించే పాత్రలు ఎప్పుడు ఎంచుకుంటారు. మూస పాత్రలు కాకుండా నిత్యం వెరైటీని కోరుకుంటారు పాత్రల్లో ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. ఈ నేపథ్యంలో తన సినీ జీవితంలో తాను చేయని పాత్ర అంటూ ఉండకూడదని కోరుకుంటారు ప్రేక్షకులను మెప్పించే క్రమంలో తనదైన శైలి ప్రదర్శిస్తుంటారు. తాజాగా తమిళంలో విజయవంతమైన అసురన్ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా నారప్పగా మలిచారు. ఇందులో వెంకటేష్ వైవిధ్యమున్న పాత్రను చాలెంజింగ్ గా పోషించి తనలోని నటనా కౌశలాన్ని బయటపెట్టారు.

తమిళంలో హీరో ధనుష్ పోషించిన పాత్రను తెలుగులో వెంకటేష్ పోషిస్తున్నారు. నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 20న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఫిలింబీట్ తెలుగులో ముచ్చటించారు. నారప్ప సినిమాను ఓటీటీలో సడెన్ గా రిలీజ్ చేయడం లేదు. నేను కాలంతో ప్రయాణించను అని వెంకటేష్ అన్నారు. నా సినిమా విషయంలో ఓటీటీలో రిలీజ్ కావడం ఇదే ఫస్ట్ టైమ్. జీవితంలో ఏది మన ముందుకు వస్తే దానిని అంగీకరించాలి అంటారు వెంకటేష్.

సినిమా కమర్షియల్స్ గురించి ఎప్పుడు ఆలోచించను నా డ్యూటీ నేను బాగా చేశానా లేదా అన్నదే నా కర్తవ్యం. గతంలో కూడా ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారని నా ఫ్యాన్స్ సినీ వర్గాలు అడుగుతుంటారు. దానికి నేను పట్టించుకోను అంటారు వెంకటేష్. పరిస్థితుల వల్ల అలాంటివి చోటుచేసుకుంటాయి. నారప్ప థియేటర్లలో రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారా? సాధారణంగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేయాలని నా ఫ్యాన్స్ కోరుకుంటారు. కానీ పరిస్థితుల వల్ల ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. నా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. నా అభిమానులు నిరుత్సాహ పడ్డారు. ఆ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను.

అసురన్ సినిమా ఓ చాలెంజింగ్ గా ఉంటుంది. ధనుష్ చేసిన పాత్రను చేయడం గొప్ప చాలెంజ్. ఆయన హావభావాలు చాలా ఫర్ ఫెక్ట్ గా ఉంటాయి. వాటిని పండించాలంటే మామూలు విషయం కాదు. గతంలో కూడా చాలా సినిమాలు రీమేక్ లు చేశారు. కానీ ఇది ఓ చాలెంజ్ గా తీసుకున్నాను. ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తానన్న నమ్మకం ఉంది. రీమేక్ సినిమాల్లో నటించడం కూడా సవాలే. పాత్రను పండించడంలో కూడా ఎంత నిజాయితీ ఉండాలనేది ముఖ్యం. నారప్ప ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.