https://oktelugu.com/

Prabhas Radhe Shyam Movie: ప్రభాస్ ఒక్కఫైట్​ కూడా లేకుండా చేసిన సినిమా ఇదే

Prabhas Radhe Shyam Movie: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది. పైగా పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమా కోసం.. యావత్ భారతీయ సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆతృత నడుమ భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ‘రాధే శ్యామ్’ కోసం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. అయితే, ఈ సినిమాలో ఓ విశేషం ఉంది. అసలు, రెబల్ స్టార్ ప్రభాస్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 10, 2022 / 01:58 PM IST
    Follow us on

    Prabhas Radhe Shyam Movie: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది. పైగా పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమా కోసం.. యావత్ భారతీయ సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆతృత నడుమ భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ‘రాధే శ్యామ్’ కోసం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. అయితే, ఈ సినిమాలో ఓ విశేషం ఉంది.

    Prabhas Radhe Shyam

    అసలు, రెబల్ స్టార్ ప్రభాస్ విలన్​లను చితక్కొడుతుంటే చూస్తూ విజిల్స్ వేయకుండా ఉంటామా చెప్పండి. ‘యోగి’ సినిమాలో విలన్​ను ఒక్క గుద్దుకే చంపిన డార్లింగ్​.. కెరీర్​లోనే తొలిసారిగా ఒక్కఫైట్​ కూడా లేకుండా చేసిన సినిమానే ‘రాధేశ్యామ్​’. ప్యూర్ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకురానుంది.

    మరి డార్లింగ్ అటు ప్రేక్షకులతో పాటు మాస్​ ఆడియెన్స్​ను ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. ఇక రాధేశ్యామ్ కనీసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే టాల్ బ్యూటీ పూజా హెగ్డేకి 4 కోట్లు రెమ్యునరేషన్ ను ఇచ్చారు. కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    Radhe Shyam

    కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే, ‘రాధేశ్యామ్’ సినిమాని మొదటి నుంచి ఓవర్ గా ప్రమోట్ చెయ్యట్లేదు. సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదు అన్నట్టే టీమ్ ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ను చాలా సింపుల్ గా కట్ చేశారు. ప్రభాస్ స్టార్ హీరో అయినా, పాన్ ఇండియా స్టార్ హీరో అయినా కేవలం పరిపూర్ణమైన ప్రేమ కథతోనే ఈ సినిమా సాగుతుందని ఎలివేట్ చేస్తూ వస్తున్నారు.

    Tags