https://oktelugu.com/

ఫ్రైడే ఫైట్ః ఒకే ఒక్క స‌క్సెస్ అంటున్న ముగ్గురు హీరోలు!

సినిమా ఇండ‌స్ట్రీలో ఎంత క‌ష్ట‌ప‌డుతున్నార‌నేది కాదు.. ఎంత స‌క్సెస్ వ‌చ్చింద‌న్న‌దే కావాలి. అందుకే.. విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతుంటారు అంద‌రూ. అయితే.. కొంద‌రికి వెంట‌నే గెలుపు ప‌క్క‌నే ఉంటే.. మ‌రికొంద‌రితో దోబూచు లాడుతూ ఉంటుంది. అలాంటి కండీష‌న్ ఫేస్ చేస్తున్న‌వారిలో ముందు వ‌ర‌స‌లో ఉంటారు మంచు హీరో విష్ణు. సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి రెండు ద‌శాబ్దాలు ద‌గ్గ‌ర కావ‌స్తోంది. కానీ.. వెన‌క్కి తిరిగి చూసుకుంటే మాత్రం విజ‌యాలు అంతంతే. ఎటు చూసినా.. ఢీ, దేనికైనా రెఢీ చిత్రాలే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 15, 2021 / 07:26 PM IST
    Follow us on

    సినిమా ఇండ‌స్ట్రీలో ఎంత క‌ష్ట‌ప‌డుతున్నార‌నేది కాదు.. ఎంత స‌క్సెస్ వ‌చ్చింద‌న్న‌దే కావాలి. అందుకే.. విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతుంటారు అంద‌రూ. అయితే.. కొంద‌రికి వెంట‌నే గెలుపు ప‌క్క‌నే ఉంటే.. మ‌రికొంద‌రితో దోబూచు లాడుతూ ఉంటుంది. అలాంటి కండీష‌న్ ఫేస్ చేస్తున్న‌వారిలో ముందు వ‌ర‌స‌లో ఉంటారు మంచు హీరో విష్ణు.

    సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి రెండు ద‌శాబ్దాలు ద‌గ్గ‌ర కావ‌స్తోంది. కానీ.. వెన‌క్కి తిరిగి చూసుకుంటే మాత్రం విజ‌యాలు అంతంతే. ఎటు చూసినా.. ఢీ, దేనికైనా రెఢీ చిత్రాలే క‌నిపిస్తుంటాయి. ఫెయిల్యూర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి, స‌క్సెస్ జ‌ర్నీ స్టార్ట్ చేయాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అనుకుంటున్నా.. అది సాధ్యం కావ‌ట్లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ ఇంట్ర‌స్టింగ్ స‌బ్జెక్టుతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు విష్ణు. బ్యాంకు మోసం నేప‌థ్యంలో ‘మోసగాళ్లు’ అనే చిత్రం చేశాడు విష్ణు. ఈ నెల 19న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో కాజ‌ల్ విష్ణు సోద‌రిగా న‌టించ‌డంతో మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

    ఇక‌, ఈ శుక్ర‌వారం రాబోతున్న మ‌రో హీరో ఆది సాయికుమార్‌. తొలిచిత్రం ‘ప్రేమ కావాలి’, ఆ తర్వాత వచ్చిన ‘లవ్ లీ’ మూవీతో యూత్ ను ఆకట్టుకున్న ఆదికి.. ఆ తర్వాత చెప్పుకోదగిన సినిమానే పడలేదు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. సక్సెస్ వరించలేదు. దీంతో.. ఇ‌ప్పుడు ‘శశి’ అనే చిత్రంతో అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీ విజ‌యం త‌న కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ కావ‌డంతో.. దీనిపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నాడు ఆది.

    ఇక ఫ్రైడే ఫైట్ లో జాయిన్ కాబోతున్న మ‌రో హీరో కార్తికేయ‌. మొద‌టి చిత్రం ‘ఆర్ఎక్స్‌100’ సూపర్ హిట్ కొట్టి ఒక్కసారిగా ఇటు ప్రేక్ష‌కుల దృష్టినీ, అటు ఇండ‌స్ట్రీ దృష్టినీ ఆక‌ర్షించాడు. అయితే.. ఈ సినిమా హీరోయిన్ పాయ‌ల్ తోపాటు కార్తికేయకు కూడా మ‌రో స‌క్సెస్ ద‌క్క‌లేదు. ఆ సినిమా త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ స‌క్సెస్ మాత్రం రిపీట్ కాలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘చావుక‌బురు చ‌ల్ల‌గా’ అంటూ మరో చిత్రంతో రాబోతున్నాడు.

    ఈ విధంగా ఈ ముగ్గురికీ ఈ స‌క్సెస్ ఎంత అవ‌స‌ర‌మో వారికే తెలుసు. ఓ ర‌కంగా లైఫ్ అండ్ డెత్ అన్న‌ట్టుగా ఉంది వారి కెరీర్ ప‌రిస్థితి. అందుకే.. ఈ చిత్రం ద్వారా ఎలాగైనా స‌క్సెస్ కొట్టాల‌ని వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. మ‌రి ఈ 19న రిలీజ్ కాబోతున్న ఈ ముగ్గురి చిత్రాల్లో ఏది స‌క్సెస్ అవుతుంది? ఎవ‌రిని విజ‌యం వ‌రిస్తుంది? అన్న‌ది చూడాలి.