https://oktelugu.com/

ఇంటర్ విద్యార్థులకు రూ.80,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

2021 సంవత్సరానికి నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్ నోటిఫికేషన్ ‌ విడుదలైంది. ఇంటర్ బైపీసీ చదివిన విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. సైన్స్ లో వేర్వేరు కోర్సులు చేసి సైంటిస్ట్ లు కావాలని భావించే వాళ్లకు నెస్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్షకు హాజరైన వాళ్లు పీజీ కోర్సు – ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలను పొందే అవకాశం ఉంటుంది. Also Read: పెన్షన్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 16, 2021 11:12 am
    Follow us on

    NEST Application Form Released.

    2021 సంవత్సరానికి నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్ నోటిఫికేషన్ ‌ విడుదలైంది. ఇంటర్ బైపీసీ చదివిన విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. సైన్స్ లో వేర్వేరు కోర్సులు చేసి సైంటిస్ట్ లు కావాలని భావించే వాళ్లకు నెస్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్షకు హాజరైన వాళ్లు పీజీ కోర్సు – ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలను పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: పెన్షన్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..?

    నెస్ట్ కు ఎంపికైన వాళ్లు ఐదు సంవత్సరాల కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. 2021 – 2026 సంవత్సరంలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులలో పీజీ కోర్సు- ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. 2019, 2020 సంవత్సరాల్లో ఇంటర్‌ (సైన్స్‌) గ్రూప్‌లో 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు, ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న వాళ్లు నెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: ఏప్రిల్ నుంచి ఆదాయపు పన్నులో కొత్త నిబంధనలివే..?

    2021 సంవత్సరం ఆగష్టు 1వ తేదీ తరువాత జన్మించిన జనరల్‌, ఓబీసీ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి. నెస్ట్‌- 2021 పరీక్షలో అర్హత సాధించిన వాళ్లకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో రెండు సెషన్లలో ఈ పరీక్షల నిర్వహణ జరుగుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు ఉండగా అభ్యర్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్ధ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లను ఎంచుకోవాలి. https://www.nestexam.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.80,000 స్కాలర్ షిప్ లభిస్తుంది.