పెన్షన్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ బకాయిల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పెన్షన్, పెన్షనర్ల విభాగం రిటైర్మెంట్ ప్రయోజనాలను సకాలంలో పూర్తి చేయాలని మంత్రులకు ఆదేశాలు జారీ చెసింది. కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేయడానికి సిద్ధమైంది. Also Read: ఇంటర్ విద్యార్థులకు […]

Written By: Kusuma Aggunna, Updated On : March 16, 2021 11:18 am
Follow us on

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ బకాయిల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పెన్షన్, పెన్షనర్ల విభాగం రిటైర్మెంట్ ప్రయోజనాలను సకాలంలో పూర్తి చేయాలని మంత్రులకు ఆదేశాలు జారీ చెసింది. కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేయడానికి సిద్ధమైంది.

Also Read: ఇంటర్ విద్యార్థులకు రూ.80,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

ఒక ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో పెన్షన్ బెనిఫిట్స్ పురోగతిని సులభంగా సమీక్షించవచ్చని మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్లకు పదవీ విరమణ ప్రయోజనాలను అందించడంలో ఆలసత్వం ప్రదర్శిస్తే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ 1972 సిసిఎస్ రూల్స్ అమలు ప్రకారం మాత్రమే ఉద్యోగికి సంబంధించిన బకాయిలను సకాలంలో క్లియర్ చేయాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read: క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిషేధం విధించనుందా..?

నిబంధనల ప్రకారం ఉద్యోగి పదవీ విరమణకు సంవత్సరం మునుపే ధృవీకరణ, ఇతరత్రా వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ నివేదికలో స్పష్టం చేసింది. పదవీ విరమణ చేయబోయే ఉద్యోగి ఫారాలను నాలుగు నెలల ముందుగానే సంబంధిత విభాగాల అధిపతులు పిఏఓకు సమర్పించాల్సి ఉంటుందని కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

పీఏఓకు సమర్పించిన తరువాత పీపీఓ జారీ అవుతుందని ఆ ఫారమ్స్ సీపీఓఓకు చేరుకుంటాయని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల లక్షల సంఖ్యలో పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.